NIA raids 56 places in Kerala linked to PFI leaders, members: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. గురువారం ఉదయం నాలుగు గంటల నుంచే కేరళ వ్యాప్తంగా రైడ్స్ చేస్తోంది. పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు నిర్వహిస్తోంది. మొత్తం 56 చోట్ల ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఇటీవల పీఎఫ్ఐని భారత ప్రభుత్వం నిషేధించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పాటు అక్రమ నిధులు కేసులో ఎన్ఐఏ, ఈడీలు విచారణ జరపుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పీఎఫ్ఐపై దాడులు నిర్వహించిన ఎన్ఐఏ మరోసారి పీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు, సభ్యులు, ఇతర కార్యకర్తలు ఇళ్లలో సోదాలు చేస్తోంది.
తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, ఎర్నాకులం, అలప్పుజ, మలప్పురం జిల్లాల్లో దాడులు కొనసాగుతున్నాయి. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కొన్ని నెలల క్రితం 100కు పైగా మంది పీఎఫ్ఐ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. ఈ నిషేధిత సంస్థ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థతో టచ్ లో ఉందని.. వాటి ద్వారా నిధులు సేకరించేందు ప్రయత్నిస్తోందిన కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
Read Also: Kidnapping Girl: జగిత్యాల జిల్లాలో కిడ్నాప్‌కలకలం.. బాలికను కారులో ఎక్కించుకుని..
ఇదిలా ఉంటే పీఎఫ్ఐ నిషేధం తరువాత వేరే పేరుతో తిరిగి సంస్థను స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతోనే తాజాగా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అండర్ గ్రౌండ్ లో ఉన్న పీఎఫ్ఐ సభ్యులు, సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తుండటంతో మరోసారి ఎన్ఐఏ వారిపై ఉక్కుపాదం మోపింది. కేరళలోనే యాక్టివ్ గా కార్యకలాపాలు జరుగుతుండటంతో ఎన్ఐఏ ఫోకస్ పెంచింది. ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా పీఎఫ్ఐ మతోన్మాదాన్ని పెంచిపోషిస్తోంది. దీంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పలు ఉగ్రవాద సంస్థలతో లింకులు పెట్టుకుంది.
దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, కర్ణాటకలో జరిగిన పలు హత్యల్లో పీఎఫ్ఐ హస్తం ఉంది. సంజిత్ (కేరళ, నవంబర్ 2021), వి-రామలింగం (తమిళనాడు, 2019), నందు (కేరళ, 2021), అభిమన్యు (కేరళ, 2018), బిబిన్ (కేరళ, 2017), శరత్ (కర్ణాటక, 2017), ఆర్.రుద్రేష్ (కర్ణాటక, 2016), ప్రవీణ్ పుయారి (కర్ణాటక, 2016), శశి కుమార్ (తమిళనాడు, 2016) ఇలా పలువురు హత్యలకు గురయ్యారు. వీటన్నింటి వెనక పీఎఫ్ఐ ఉంది.