Site icon NTV Telugu

Bayya Sunny Yadav: ఎన్‌ఐఏ అదుపులో భయ్యా సన్నీ యాదవ్.. పాక్ టూర్‌పై ఆరా

Bayyasunnyyadav

Bayyasunnyyadav

యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే సన్నీ యాదవ్ బైక్‌పై పాకిస్థాన్ వెళ్లి వచ్చాడు. దీంతో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఎవరితోనైనా సంబంధాలు కలిగి ఉన్నాడా? ఎలాంటి గూఢచర్యం చేశాడన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: మమత సర్కార్‌పై మోడీ తీవ్ర విమర్శలు.. ‘నిర్మంత’ అంటూ వ్యాఖ్య

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్రాతో సహా పలువురిని జాతీయ దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రా.. పాకిస్థాన్ అధికారులతో చాలా క్లోజ్‌గా తిరిగింది. పాకిస్థాన్ ఐఎస్ఐతో కూడా మంచి సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన యూట్యూబ్‌లో పాకిస్థాన్‌కు సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయి. ఆమె పాకిస్థాన్‌కు మూడు సార్లు వెళ్లి వచ్చింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌ ఉగ్ర దాడికి ముందు కూడా జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు వెళ్లినట్లుగా గుర్తించినట్లు సమాచారం. పహల్గామ్‌కు సంబంధించిన వీడియోలను జ్యోతి మల్హోత్రా.. పాక్ అధికారులకు చేరవేసినట్లు అనుమానించారు. ప్రస్తుతం ఆమె హర్యానా జైల్లో ఉంది. 9 రోజుల పాటు ఆమెను దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Deputy CM Bhatti: దేశంలో ఎక్కడ లేని విధంగా ఇందిరమ్మ ఇళ్లకు రూ. 5 లక్షలు ఇస్తున్నాం..

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌కు సింధు జలాలు నిలిపేసింది. పాక్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దును మూసేసింది. అనంతరం మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి.

Exit mobile version