TAHAWWUR RANA: తహవూర్ రాణాని అధికారికంగా అరెస్ట్ చేసిన ఎన్ఐఏ..
- అమెరికా నుంచి ఇండియాకు చేరిన మోస్ట్ వాంటెడ్ తహవూర్ రాణా..
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన ఎన్ఐఏ..
- వైద్య పరీక్షల అనంతరం పాటియాలా కోర్టులో హాజరు..
- 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ముంబై దాడుల ఉగ్రవాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TAHAWWUR RANA: 26/11 ముంబై ఉగ్రదాడి కుట్రదారు, ఉగ్రవాది తహవూర్ హుస్సేన్ రాణానికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారికంగా అరెస్ట్ చేసింది. భారత అధికారులు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుంచి రొమేనియా మీదుగా ఛార్టెడ్ ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఢిల్లీకి తీసుకువచ్చిన వెంటనే ఎన్ఐఏ అతడిని అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ సంవత్సరాల కృషి మూలంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని అమెరికా భారత్‌కి అప్పగించింది.
రాణాకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, పాటియాలా కోర్టులో హాజరుపర్చనున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి పాటియాల హౌజ్ కోర్టు వరకు తీసుకెళ్లే మార్గంలో విస్తృత భద్రత ఏర్పాటు చేశారు. ఢీల్లీలోని పరేడ్ రోడ్, సర్దార్ పటేల్ రోడ్, మదర్ థెరిస్సా క్రిసెంట్, అక్బర్ రోడ్ మీదుగా కోర్టుకు తీసుకెళ్లనున్నారు.
Also Read
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
Read Also: Puri – Sethupathi: ఇట్స్ అఫీషియల్.. టబు ఆన్ డ్యూటీ
తహవూర్ రాణా చివరి వరకు భారత్‌కి అప్పగించకుండా అమెరికాలోని అన్ని న్యాయ సదుపాయాలను ఉపయోగించుకున్నాడు. చివరకు అక్కడి న్యాయస్థానాలు రాణాని భారత్‌కి అప్పగిస్తూ తీర్పు చెప్పాయి. ఎన్ఐఏ పలు సంవత్సరాల కృషి కారణంగా ఉగ్రవాదిని భారత్‌కి రప్పించగలిగారు. రాణా అప్పగింతలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యునైటెడ్ స్టేట్స్‌లోని సంబంధిత అధికారులు సమన్వయం చేసుకున్నారు.
2008లో ముంబైలోని విధ్వంసకర ఉగ్రవాద దాడుల్లో పాక్-కెనెడియన్ అయిన 67 ఏళ్ల రాణా హస్తం ఉంది. రాణా, పాక్ అమెరికన్ అయిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ, పాక్ కుట్రదారులతో కలిసి లష్కరే తోయిబా, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. 26/11 ముంబై దాడుల్లో 166 మంది మరణానికి కారణం అయ్యాడు.
తాజావార్తలు
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
-
Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్‌పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Test Match: ఆ ప్లేయర్‌కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!