NTV Telugu Site icon

FASTag Alert: ముందువైపు అద్దం మీదే ఫాస్టాగ్‌.. లేకపోతే టోల్‌ రుసుం డబుల్..!

Fasgat

Fasgat

FASTag Alert: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు వాహనదారులు ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్‌లను వాహనం విండ్‌షీల్డ్‌పై ఏర్పాటు చేయకపోవడంతో టోల్‌గేట్ల దగ్గర చెల్లింపుల విషయంలో అంతరాయం కలుగుతుంది. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇకపై విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్‌ స్టికర్‌ ఏర్పాటు చేయకపోతే.. టోల్‌లైన్‌లోకి ప్రవేశించే వాహనదారుల నుంచి డబుల్‌ టోల్‌ వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విండ్‌స్క్రీన్‌పై ఉద్దేశపూర్వకంగా ఫాస్ట్‌ట్యాగ్‌ను ఇన్‌స్టాల్ చేయకపోవడంతో టోల్ ప్లాజాల దగ్గర అనవసరమైన జాప్యాలు కొనసాగుతున్నాయని.. దాంతో ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.

Read Also: Pakistan : భయపడిన పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వం..ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై నిషేధం

కాగా, ముందువైపు అద్దంపై ఫాస్టాగ్ స్టికర్ లేకపోతే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలంటూ అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలు, రాయితీదారులకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ పొడ్యూసర్‌ని జారీ చేసింది. దీంతో ఫాస్టాగ్‌లను అమర్చని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ లేకుండా టోల్‌లేన్‌లోకి ప్రవేశిస్తే విధించే రుసుంలపై డబుల్ ఫీజులతో కూడిన బోర్డులు ప్రదర్శించాలని ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలు ఇచ్చింది. ఫాస్టాగ్‌లు లేని వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సీసీటీవీ ఫుటేజీలో సైతం రికార్డు చేయాలని వెల్లడించింది. దీంతో వాహనాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించవచ్చని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

Read Also: AP Disaster Management Authority: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..

అయితే, ఫాస్టాగ్‌లను ఏర్పాటు చేసుకోలేకపోతే లావాదేవీల నిర్వహణకు అర్హత ఉండదని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సూచించింది. అలాంటి వారు రెట్టింపు టోల్ రుసుమును చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పాడింది. అలా చేసే వారిని బ్లాక్‌లిస్ట్‌ చేర్చ వచ్చని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. వివిధ పాయింట్ల నుంచి జారీ చేసే సమయంలో వాహనం విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్‌ ఇన్‌స్టాల్‌ చేసినట్లుగా నిర్ధారించుకోవాలని ఆయా బ్యాంకులను సైతం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న వెయ్యి టోల్ ప్లాజాల దగ్గర సుమారు 45 వేల కిలో మీటర్ల జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో వాహనదారుల నుంచి టోల్‌ రూసుం వసూలు చేస్తున్నారు. దాదాపు 8 కోట్ల మంది నుంచి టోల్‌ వసూలు చేస్తున్నారు. ఫాస్టాగ్‌ దేశంలో ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.