మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) కూటమి ఘన విజయం సాధించింది. ఇక బీజేపీ అయితే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి.. సంఖ్యాబలం కలిగి ఉంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 132 అసెంబ్లీ స్థానాలను కమలనాథులు కైవసం చేసుకున్నారు. బీజేపీకి వచ్చిన సీట్లలో సగం మాత్రమే షిండేకు చెందిన శివసేనకు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి పదవిపై అంతగా నోరు మెదపడం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Adani Group: అదానీకి మరో ఎదురు దెబ్బ.. భారీ ప్రకటన చేసిన ఫ్రెంచ్ దిగ్గజం
ఆదివారం శివసేన ఎమ్మెల్యేలంతా ఏక్‌నాథ్ షిండేను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా షిండేను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ ఫార్ములా అమలు చేయాలని కోరారు. బీహార్‌లో నితీష్ కుమార్‌కు సంఖ్యాబలం లేకపోయినా.. ముఖ్యమంత్రి సీటులో కూర్చుకున్నారు. అదే తరహా సిద్ధాంతాన్ని మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని షిండే వర్గ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కానీ బీజేపీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదని సమాచారం.
ఇది కూడా చదవండి: Aamir Khan : సినిమాలకు స్టార్ హీరో అమీర్ ఖాన్ స్వస్తి.. కానీ..?
ఇదిలా ఉంటే అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీకి 41 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. దీంతో ఆ పార్టీ ఇప్పటికే బీజేపీ ముఖ్యమంత్రికి మద్దతు ప్రకటించేశారు. దీంతో ఈజీగా శివసేన మద్దతు లేకుండా సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఈ నేపథ్యంలోనే షిండే ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేయడం లేదని.. మౌనంగా ఉన్నారంటూ పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేవలం డిప్యూటీ సీఎం పదవి తీసుకుని సరిపెట్టుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి దక్కే ఛాన్సుంది. ఇక దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. బీజేపీ పెద్దలతో ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. ఈ సాయంత్రానికి మహారాష్ట్ర సీఎం పదవిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 132, షిండే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్సీపీకి 41, ఉద్ధవ్ థాకరే పార్టీకి 20, కాంగ్రెస్‌కు 16, శరద్ పవార్ పార్టీకి 10, ఎస్పీకి 2, ఇతరులకు 10 సీట్లు వచ్చాయి. మొత్తం రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Ram Talluri : ‘వికటకవి’ చూసి నాకు గర్వంగా అనిపించింది