Site icon NTV Telugu

Pahalgam Terror Attack: 7 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్

Vinaynarwal

Vinaynarwal

పహల్గామ్ ఉగ్ర దాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్(26) ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదంగా మారింది. 7 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు సంతోషంగా.. ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. భార్యతో కలిసి హనీమూన్‌ కోసం కాశ్మీర్‌కు వెళ్లాడు. మంగళవారం పహల్గామ్‌లో భార్యతో కలిసి విహరిస్తున్నాడు. అంతే ఒక్కసారిగా ఉగ్రమూకలు విరుచుకుపడ్డారు. ముష్కరుల తూటాలకు అక్కడికక్కడే వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాది.. ముస్లిమా? అని అడిగాడని.. కాదనగానే తుపాకీతో కాల్చారని భార్య కన్నీటితో కుప్పకూలిపోయింది. అతడి మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న నేవీ అధికారిని పొట్టన పెట్టుకున్నారని వాపోయారు.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: 5 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్

వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితమే నేవీలో చేరి కొచ్చిలో పోస్టింగ్ పొందారు. ఏప్రిల్ 16, 2025న ఘనంగా వివాహం జరిగింది. బంధుమిత్రుల, స్నేహితులంతా వచ్చి అభినందనలు తెలిపారు. ఇక ఏప్రిల్ 19న గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఇచ్చాడు. భార్యతో కలిసి ప్రకృతిని ఆస్వాదించడానికి కాశ్మీర్‌కు వెళ్లాడు. కానీ మృత్యువు ఈ రూపంలో వస్తుందని ఊహించలేకపోయాడు. ముష్కరులు పొట్టనపెట్టుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.

వినయ్ నర్వాల్ మరణ వార్తతో ఇరుగుపొరుగువారు, స్థానికులు దు:ఖంలో మునిగిపోయారు. మంచి భవిష్యత్ ఉన్న యువ అధికారిగా గుర్తుచేస్తున్నారు. ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఆవేదన చెందారు.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack : మా హృదయాలను పిండేస్తోంది.. పహల్గాం దాడిపై సెలబ్రిటీలు

Exit mobile version