NTV Telugu Site icon

Chhattisgarh: కొత్తగా పెళ్లైన జంట.. రిసెప్షన్‌కు ముందు కత్తిపోట్లతో మృతి.. అసలేం జరిగింది.

Raipur Crime News

Raipur Crime News

Couple Found Dead: కొత్తగా పెళ్లైన జంట నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన వాళ్లు కానీ, పెళ్లైన తర్వాత రిసెప్షన్ ముందే చనిపోయారు. కత్తిపోట్లకు గురై మరణించినట్లు పోలీస్ విచారణలో తేలింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగింది. ఇద్దరు దంపతులు తమ ఇంట్లోని ఓ గదిలో తీవ్రగాయాలతో శవాలపై కనిపించారు.

Read Also: Revanth reddy: కుక్కల దాడి ఘటన.. మనుషులపట్ల సానుభూతిలేదంటూ రేవంత్ సీరియస్‌

అస్లామ్ (24), కహ్కషా బానో (22) ఆదివారం వివాహం చేసుకున్నారు మరియు వారి వివాహ రిసెప్షన్ మంగళవారం రాత్రి జరగాల్సి ఉంది. దంపతులతో పాటు ఇతర బంధువలు అంతా ఫంక్షన్ కు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో వరుడి తల్లి వధువు అరుపులు వని అక్కడి చేరుకుంది. అయితే గది లోపల నుంచి తాళం వేసి ఉంది. కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా.. రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో దంపతులు పడి ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

తలుపులు బద్దలు కొట్టి సంఘటన స్థలంలోని మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు. కత్తిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే భార్యభర్తల మధ్య వాగ్వాదం కారణంగా ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా భర్త, భార్యపై కత్తితో దాడి చేసి, ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హత్య, ఆత్మహత్యకు సంబంధించిన కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.

Show comments