New Year Liquor Sale: 2025కి గుడ్‌బై చెప్పేసి.. 2026కి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు అంతా సిద్ధం అవుతున్నారు.. ఇక, డిసెంబర్ 31వ రోజు ప్రతీ ఏడాది రికార్డు సంఖ్యలో మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. దీనిని మరింత క్యాష్ చేసుకునేలా ప్రభుత్వాలు.. అదనపు సమయం కూడా ఇస్తున్న విషయం విదితమే.. మరోవైపు, మద్యం ప్రియులకు ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా తీపి కబురు అందించింది. డిసెంబర్ 31న ఉదయం 6 గంటల నుంచే మద్యం విక్రయాలు ప్రారంభించుకునేందుకు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వెసులుబాటు బుధవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.. అంటే ఈ అవకాశం కేవలం ఒకేరోజు మాత్రమే అమల్లో ఉంటుంది.. ఆ తర్వాత రెగ్యులర్‌గా ఉన్న నిబంధనలే వర్తింప జేయనున్నారు..
Read Also: Vietnam Beer Prices: రూ.18కి బీరు… మందు బాబులకు పండగే.. ఎక్కడో తెలుసా?
కొత్త ఏడాది వేడుకలను పురస్కరించుకుని ఈ సడలింపును ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం.. బార్‌లు, పబ్‌లు, వైన్‌షాప్‌లు, ఇతర మద్యం విక్రయ కేంద్రాలన్నింటికీ ఈ కొత్త సమయాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎదురుచూస్తున్న మద్యం ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు, ప్రైవేట్ పార్టీలు, ప్రత్యేక కార్యక్రమాలు, తాత్కాలిక మద్యం సరఫరాకు ఉపయోగించే CL–5 లైసెన్స్ కలిగిన వారికి కూడా ఇదే టైం అంటే ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు సమయం వర్తింపు జేయనున్నారు.. సాధారణ రోజుల్లో CL–5 లైసెన్స్ ఉంటే 24 గంటల పాటు లిక్కర్ సేల్స్ చేస్తారనే అభిప్రాయం ఉండగా.. న్యూ ఇయర్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం సమయ పరిమితిని విధించింది అంటున్నారు.. అంటే, CL–5 లైసెన్స్ కలిగిన ప్రైవేట్ పార్టీలు కూడా డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి 1 గంట లోపే కార్యక్రమాలు ముగించాల్సి ఉంటుందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.. కానీ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా.. ఆ తర్వాత కూడా మద్యం విక్రయాలు గానీ, సరఫరా గానీ కొనసాగిస్తే.. లైసెన్స్ రద్దుతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది..