‘Daam’ virus: ఆండ్రాయిడ్ ఫోన్లపై వైరస్ అటాక్.. ఇలా చేశారంటే మీ డేటా గోవిందా.. హెచ్చరించిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Daam’ virus: ఆండ్రాయిడ్ ఫోన్లు టార్గెట్ గా కొత్త వైరస్ అటాక్ చేసే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. వినియోగదారుల కాల్ రికార్డ్స్ హ్యాక్ చేయడంతో పాటు పాస్ వర్డ్, ఇతర సెన్సిటీవ్ డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపింది. ఆండ్రాయిడ్ ఫోన్లకు హాని కలిగించే ‘దామ్’ అనే మాల్వేర్కు ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఈ మార్వెట్ మీ ఫోన్లలోని కాల్ రికార్డ్‌లు, కాంటాక్ట్‌లు, బ్రౌజింగ్ హిస్టరీ, కెమెరా వంటి వాటిని యాక్సెస్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని.. జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఈ హెచ్చరికలను జారీ చేసింది.
‘దామ్’ పేరుతో ఉన్న వైరస్ యాంటీ వైరస్ ప్రోగ్రాములను కూడా ఏమార్చగలదని, దీనిని గుర్తించడం, తీసేయడం కష్టతరం అని తెలిపింది. ఈ వైరస్ మీ మొబైల్ ఫోన్ ను లాక్ చేసి, దాన్ని అన్ లాక్ చేయడానికి డబ్బులను కూడా డిమాండ్ చేసే హానికరమైన సాఫ్ట్ వేర్ ransomwareని కూడా అమలు చేస్తుందని తెలిపింది. థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌ని అన్ ట్రస్ట్డ్, అన్ నోన్ సోర్స్ నుంచి డౌన్ లోడ్ చేస్తే ఈ వైరస్ మొబైల్ ఫోన్లలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
Read Also: RS.2000 note withdrawal: రూ. 2000 నోటకు “నో” చెప్పిన పెట్రోల్ పంప్ ఆపరేటర్.. పోలీసులకు ఫిర్యాదు..
ఒకసారి డామ్ వైరస్ ఫోన్లలోకి ఎంటరైతే, అది ఫోన్ భద్రతా వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఫోన్ కాల్ రికార్డింగ్స్, కాంటాక్స్ హ్యాక్ చేస్తుంది. కెమెరాను యాక్సెస్ చేయగలదని హెచ్చిరిస్తున్నారు నిపుణులు. మొబైల్స్ లోని ఫైల్స్ ను ఎన్‌క్రిప్ట్ చేయడానికి మాల్వేర్ AES అనే అధునాతన ఎన్క్రిప్షన్ అల్గారిథమ్ని ఉపయోగిస్తుంది. ఇది డివైజ్ లో ఉండే ఫైల్స్ ను తొలగించిడానికి, ఎన్ క్రిప్ట్ చేయడానికి సహాయపడుతుంది. ఒక్కోసారి పర్సనల్ డేటాను దొంగిలించి డబ్బులను కూడా డిమాండ్ చేసే ర్యామ్సన్ వేర్ గా మారొచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో పడకూడదంటే.. అన్ ట్రస్టెడ్ వెబ్ సైట్లను, అన్ నోన్ లింక్స్ పై క్లిక్ చేయడం చేయొద్దని కేంద్రం తెలిపింది. యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేయడం మంచిది. అనుమానాస్పద ఫోన్ నెంబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ‘bitly’ లేదా ‘tinyurl’ హైపర్‌లింక్‌లను కలిగి ఉన్నటువంటి సంక్షిప్త URLలతో వ్యవహరించేటప్పుడు వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ URLలు హానికరమైన వెబ్సైట్లకు దారి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..