Site icon NTV Telugu

CBSE: సీబీఎస్‌ఈ పాఠశాలల్లో కొత్త నిబంధనలు.. ఆదేశాలు జారీ

Cbse

Cbse

పాఠశాలల్లో పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని సీబీఎస్‌ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గత నిబంధనను సవరిస్తూ తన పరిధిలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు సీబీఎస్‌ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా లేఖ రాశారు. పాఠశాలలు హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలను ఆడియో-విజువల్ సౌకర్యంతో ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Mumbai: ముంబైలో దారుణం.. భర్తను చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య

పాఠశాలలోని అన్ని ప్రవేశ, నిష్క్రమణ (ఎంట్రీ, ఎక్సిట్) పాయింట్ల దగ్గర ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే లాబీలు, కారిడార్లు, మెట్ల మార్గాల్లో ఉండాలని తెలిపింది. అంతేకాకుండా అన్ని తరగతి గదులు, ప్రయోగశాలలు (Labs), గ్రంథాలయం (Library)లో కూడా కెమెరాలు ఉండాలని తెలిపింది. ఇక క్యాంటీన్ ప్రాంతం, స్టోర్ రూమ్, ఇతర సాధారణ ప్రాంతాల్లో కూడా భద్రతా ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇక ఆట స్థలం (Playground)లో కూడా కెమెరాలు ఉండాలని పేర్కొంది. టాయిలెట్లు, వాష్‌రూమ్‌లు మినహా అన్ని ప్రాంతాల్లో రియల్ టైమ్ ఆడియో-విజువల్ రికార్డింగ్ ఉండాలని సీబీఎస్‌ఈ ఆదేశించింది. 15 రోజుల స్టోరేజ్ బ్యాక్ అప్ ఉండేలా చూసుకోవాలని చెప్పింది. అవసరమైన సంబంధిత అధికారులు 15 రోజుల బ్యాకప్‌ని యాక్సెస్‌ చేయగలిగేలా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతతో పాటు సర్వైలెన్స్‌ మౌలిక వసతులను బలోపేతం చేయడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు హిమాన్షు గుప్తా తెలిపారు.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: బెంగాల్‌లో రాజకీయ మార్పు దేనికి.. 11 ఏళ్లు ఏం చేశారని మార్పు కావాలి.. మోడీపై మమత ఫైర్

Exit mobile version