Site icon NTV Telugu

New Rules For International Passengers : అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక అది అవసరం లేదు..

International Passengers

International Passengers

కరోనా మహమ్మారి ఎంట్రీ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులపై ఎన్నో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.. అయితే, మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితిలు వస్తుండడంతో.. క్రమంగా ఆ రూల్స్‌ను అన్ని ఎత్తివేస్తూ వస్తున్నాయి వివిధ దేశాలు.. ఈ నేపథ్యంలో భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. అంతర్జాతీయ ప్రయాణికులు ఇకపై కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన స్వీయ డిక్లరేషన్ ఫారాలను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో పూరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్రం.. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి రాబోతున్నాయి.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్‌లో గణనీయమైన పురోగతి కొనసాగుతున్నందున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read Also: MLAs poaching case: తెలంగాణ బీజేపీ నేతలకు కొత్త టెన్షన్‌.. కీలక నేతలకు నోటీసులు సిద్ధం చేసిన సిట్‌..

అంటే, సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఎయిర్ సువిధ పోర్టల్‌లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది విమానయాన మంత్రిత్వ. అయితే కరోనా పరిస్థితుల అనుగుణంగా ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని క్లారిటీ ఇచ్చింది.. కాగా, విమానయాన మంత్రిత్వ శాఖ యొక్క ఎయిర్ సువిధ పోర్టల్‌లోని ఫారమ్ ఇన్‌కమింగ్ అంతర్జాతీయ ప్రయాణీకులకు తప్పనిసరి. అందులో, ప్రయాణీకులు వారి టీకా స్థితిని, స్వీకరించిన మోతాదుల సంఖ్య మరియు వాటి తేదీలతో సహా ప్రకటించాల్సి ఉండేది.. ఇది చాలా దేశాల్లోని నిబంధనలకు అనుగుణంగా ఉంది. అయితే, ప్రయాణికులు పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ కోసం అన్ని ముందు జాగ్రత్త చర్యలు.. మాస్క్‌ల వాడకం మరియు విమానాశ్రయాలలో భౌతిక దూరం పాటించడం.. ఇలా అనేక రూల్స్‌ ఉండేవి.. కానీ, గత వారం, విమానయాన మంత్రిత్వ శాఖ విమాన ప్రయాణంలో ఇకపై మాస్క్‌ల వాడకం తప్పనిసరి కాదని, అయితే, కరోనావైరస్ యొక్క మరొక ఉప్పెనను నివారించడానికి ప్రయాణికులు వాటిని ఉపయోగించాలని పేర్కొన్న విషయం విదితమే.. ఇక, ఇప్పుడు ఎయిర్ సువిధ పోర్టల్‌లో అంతర్జాతీయ ప్రయాణికులు కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన స్వీయ డిక్లరేషన్ ఫారాలను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో పూరించాల్సిన అవసరం లేదని మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం.

Exit mobile version