Site icon NTV Telugu

New Parliament Building Latest Pics: ఆకట్టుకుంటున్న పార్లమెంట్ కొత్త భవనం.. ఈ ఫొటోలు చూసి తీరాల్సిందే..

New Parliament

New Parliament

New Parliament Building Latest Pics: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవనం రూపుదిద్దుకుంటుంది.. దీనికి సంబంధించిన ఫొటోలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ సెంట్రల్‌ విస్తా ప్రాజెక్టు అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది… కొత్త పార్లమెంటు భవనం లోపల ఎలాంటి హంగులు ఉన్నాయో ఆ ఫొటోలను చూస్తే అర్థమవుతుంది.. పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలం మరియు వివిధ కమిటీల గదులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. దేశ ప్రజల భవిష్యత్‌ కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు నిలయమైన ఈ భవనం ప్రస్తుతం తుది హంగులు అద్దుకుంటోంది. జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయి.. కానీ, ఈసారి బడ్జెట్‌ సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహిస్తారా? లేదా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది..

Read Also: Terror Attack: రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులపై కత్తితో దాడి.. వీడియో వైరల్

మొత్తంగా కొత్త పార్లమెంట్ భవనం లోపల నుండి లేఅవుట్ మరియు కొత్త ఫోటోలను ప్రభుత్వం విడుదల చేసింది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ భవనాన్ని ఈ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. నిజానికి నవంబరు 2022 నాటికే నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది… అయితే, వివిధ కారణాలతో ఆలస్యమైంది. జనవరి చివరి నాటికి ‘సెంట్రల్‌ విస్తా’ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు నిర్మాణ బాధ్యతలను తీసుకున్న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్‌లో భాగంగా, కొత్త పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది, ఇందులో పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలం మరియు కమిటీ గదులు ఉన్నాయి. హాళ్లు, కార్యాలయ గదుల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. కొత్త పార్లమెంటు భవనం ఎలా ఉందో ఈ కింది చిత్రాల్లో చూడొచ్చు..

 

 

 

 

 

 

 

Exit mobile version