Supreme Court: ఏదైనా ఒక ఇంటిని కానీ, ఇతర భవనాలను అమ్ముతున్న సమయంలో పాత విద్యుత్ బిల్లును విద్యుత్ బిల్లులను చెల్లించకపోవడం చూస్తుంటాం. ఇది కొత్తగా వాటిని కొనుగోలు చేసిన యజమానులపై పడుతుంది. అయితే వారు వాడిన కరెంట్ కు మేం ఎలా బిల్లు కడుతాం అనే ప్రశ్న ఇటువంటి సందర్భాల్లో ఉద్భవిస్తుంటుంది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
Read Also: Power War: కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య “పవర్ వార్”.. మళ్లీ సుప్రీంకు చేరిన పంచాయతీ..
ఏదైనా ఒక ప్రాంగణం నుంచి రావాల్సిన విద్యుత్ బిల్లును దాన్ని కొత్తగా కొనుగోలు చేసిన యజమానుల నుంచి వసూలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత యజమానులు బిల్లలు కట్టకపోవడంతో విద్యుత్ అధికారులు తమ ఇళ్లకు విద్యుత్ నిలిపేశారని చెబుతూ.. 19 మంది పిటిషన్ దాఖలు చేశారు. కేరళకు చెందిన ఈ కేసును సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడా ధర్మాసనం విచారించింది. ఈ కేసులో కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్(కేఎస్ఈబీ)కి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
2003 విద్యుత్ చట్టంలోని సెక్షన్ 43 ప్రకారం విద్యుత్ సరఫరా చేయడం తప్పనిసరి కాదు. అది విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్దేశించిన ఛార్జీలు, నియమనిబంధనలకు లోబడి చేసుకునే దరఖాస్తుకు అనుగుణంగా ఉంటుందని, 1948 నాటి చట్టంలోని సెక్షన్ 49 ప్రకారం విద్యుత్ సరఫరా చేయాలంటే పాత యజమాని బకాయిలను కొత్త యజమాని చెల్లించడం తప్పనిసరి అని, పాత బకాయిలను కొత్త యజమాని నుంచి వసూలు చేసుకోవడానికి ఎలక్ట్రిసిటీ సప్లై కోడ్ వీలు కల్పిసుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
