Karnataka: 65 ఏళ్ల వృద్ధురాలికి 33 ఏళ్ల మహిళా లెక్చరర్ కాలేయం దానం.. చివరికిలా..!
- 65 ఏళ్ల వృద్ధురాలికి 33 ఏళ్ల మహిళా లెక్చరర్ కాలేయం దానం
- శస్త్ర చికిత్స విఫలమై బాధితురాలు కన్నుమూత
- బాధితురాలికి నాలుగేళ్ల కుమారుడు.. నెటిజన్లు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవయవ దానం చేయడం మంచిదే. అది ఎప్పుడు చేయాలి.. కోమాలో ఉన్నప్పుడో.. లేదంటే చనిపోయాక చేయడం మంచిదే. అంతేకాని చిన్న వయసులో.. పసి బిడ్డలు కలిగిన వారు చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇదంతా ఎందుకంటారా? ఒక వృద్ధురాలికి అవయవ దానం చేసి యువతి తనువు చాలించింది. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ ఘటన పలువురి హృదయాలను కలిచివేస్తోంది. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

Also Read
అర్చన కామత్ అనే 33 ఏళ్ల మహిళా లెక్చరర్.. కర్ణాటకలోని మంగళూరులో తన అత్తగారి సోదరికి 60 శాతం కాలేయం దానం చేసింది. ఆ వృద్ధురాలిని అర్చన కామత్ చాలా ప్రియమైనదిగా భావించింది. ఆమెను ఎంతగానో ప్రేమించి.. ఆమె ఆరోగ్యానికి తోడ్పడాలని భావించింది. అంతే ఆ వృద్ధురాలికి అర్చన కామత్.. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో లివర్ దానం చేసింది. అయితే మూడు రోజుల తర్వాత సర్జరీ విఫలమైంది. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆరోగ్యం క్షీణించి అర్చన కామత్ (33) ప్రాణాలు వదిలింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అర్చన కామత్‌కు నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు.
అయితే ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చంటి బిడ్డ ఉన్న తల్లిని కాలేయం ఇవ్వడానికి కుటుంబ సభ్యులు ఎలా ఒప్పుకున్నారని నిలదీస్తున్నారు. భర్త అంటే మరొక పెళ్లి చేసుకుంటాడు. బిడ్డకు తల్లిని ఎవరు తీసుకొస్తారని మరొకరు ప్రశ్నిస్తున్నారు. మానసిక నిపుణులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి చర్య ఆమోద యోగ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.
#Archanakamat
ನಿಮ್ಮ್ ಆತ್ಮ ಆ ಭಗವಂತನಾ ಮಡಿಲಲ್ಲಿ ಚಿರಶಾಂತಿ ಅನುಭವಿಸಲಿ 🙏 pic.twitter.com/j3IzuMeiZj— 𝗚𝘂𝗿𝘂🇮🇳 (мσ∂ιʝι кα Y̺o̺d̺h̺a̺) (@Gururaj1972) September 21, 2024
తాజావార్తలు
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!