Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ

  • నాలుగోసారి కూడా శాంతి ఒప్పందంపై సంతకానికి నో..
  • నవంబర్ 20న హాజరుకావాలని నేహాబోరాకు కోర్టు ఆదేశాలు..
Neha Bora

Neha Bora

Neha Bora: ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ‘‘శాంతి ఒప్పందం’’పై సంతకం చేసేందుకు నాలుగోసారి కూడా నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(SEM) కోర్టు ఆమెను తమ ముందు నవంబర్ 20న హాజరుకావాలని ఆదేశించింది. శాంతియుత నిరసన నేరం కాదని నేహాబోరా వాదిస్తోంది. భావప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కును పీస్ బాండ్ పేరుతో అణచివేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లిందని పోలీసులు అనుమానించడానికి ఆధారమైన 6 ఎఫ్ఐఆర్లు, దర్యాప్తు పత్రాలన్నింటిని నేహాబోరాకు అందించాలని ఎస్ఈఎం కోర్టు ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఈమేరకు పోలీసులు డాక్యుమెంట్లను నేహా బోరాకు అప్పగించారు. దీనికిముందు 2026 అక్టోబర్ 23న పోలీసులు జారీ చేసిన షో-కాజ్ నోటీసులు, సమన్లను రద్దు చేయాలని నేహా బోరా ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. నేహా బోరా పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.

జ్ఞానేష్ కుమార్‌‌కు వ్యతిరేక నిరసనలతో ప్రారంభమైన కేసు.

ఈ మొత్త వ్యవహారం 2026 అక్టోబర్ 16న ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు, నిరసనలకు పిలుపునివ్వడంతో ప్రారంభమైంది. ఈ నిరసన చట్టవిరుద్ధమని, ఢిల్లీ పోలీసులు భారత శిక్షా స్మృతి (BNSS)లోని సెక్షన్ 126 కింద నేహా బోరాపై చర్య తీసుకోవాలని సిఫార్సు చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లడానికి, వెళ్లేలా గుంపును ప్రేరేపించారనే అభియోగాలు నేహా బోరాపై ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే నేహా బోరాను శాంతి ఒప్పందంపై సంతకం చేయాలని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ప్రజాస్వామ్య హక్కులకు ఇది విరుద్ధమని ఆమె వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 20న ఎస్‌ఈఎం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.