NEET-UG 2025: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET-UG) 2025 కొత్త నియమాలను, షెడ్యూల్‌తో నిర్వహించబోతున్నట్లు జాతీయ పరీక్షా సంస్థ (NTA) గురువారం ధృవీకరించింది. 2024లో పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
నీట్-యూజీ 2025 పెన్ను పేపర్ పద్ధతిలో (ఓఎంఆర్ షీట్), ఒకే రోజు మరియు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించబడుతుంది. ప్రస్తుతం తీసుకున్న పెన్-పేపర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించాలనే నిర్ణయం సురక్షితమైన, న్యాయమైన పరీక్షా ప్రక్రియకు తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అండర్ గ్యాడ్యుయేట్ వైద్య విద్య కోసం ఉమ్మడి ప్రవేశపరీక్ష నీట్-యూజీ నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత వైద్య కోర్సుల కోసం నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌గా ఉంది.
Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. సీసీకెమెరా వీడియో వైరల్..
దేశవ్యాప్తంగా మొత్తం 1,08,000 MBBS సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 56,000 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉండగా, 52,000 సీట్లు ప్రైవేట్ సంస్థలు అందిస్తున్నాయి. డెంటల్, ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి కోర్సుల్లో ప్రవేశానికి కూడా నీట్ ఫలితాలను ఉపయోగిస్తారు. 2024లో 24 లక్షలకు పైగా అభ్యర్థులు నీట్ పరీక్ష రాశారు.
2024 పేపర్ లీక్ వివాదం తర్వాత సంస్కరణల కోసం పిలుపునిచ్చారు. దీనిపై కేంద్రం మాజీ ఇస్రో చీఫ్ ఆర్ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రక్రియ యొక్క సమగ్రత మరియు పారదర్శకతను నిర్ధారించడానికి మల్టీ స్టేజ్ పరీక్ష విధానాన్ని కమిటీ సూచించింది.