Site icon NTV Telugu

Bihar Elections: ‘సంకల్ప్ పత్ర’ పేరుతో కోటి ఉద్యోగాల హామీ ఇచ్చిన ఎన్డీఏ

Nda2

Nda2

బీహార్ ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ‘సంకల్ప్ పత్ర’ పేరుతో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. శుక్రవారం పాట్నాలో కేంద్ర మంత్రులు జేడీ నడ్డా, జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్, సీఎం నితీష్ కుమార్, ఆర్‌ఎల్‌ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహ తదితరులు ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేశారు. కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో కూటమి పేర్కొంది.

ఎన్డీఏ కూటమి హామీలు ఇవే..
యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ
ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్ ఏర్పాటు
బీహార్ స్పోర్ట్స్ సిటీ డివిజన్లలో క్రీడలకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’
ప్రతి జిల్లాలో కర్మాగారాల నిర్మాణం, 10 కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు
100 MSME పార్కులు 50,000 కంటే ఎక్కువ కుటీర సంస్థలు ఏర్పాటుకు హామీ
డిఫెన్స్ కారిడార్, సెమీకండక్టర్ తయారీ పార్క్ ఏర్పాటుకు హామీ
మహిళా ఉపాధి పథకం నుంచి మహిళలకు 2 లక్షల సాయం
కోటి మంది మహిళలు లఖ్పతి దీదీ యోజన
కిసాన్ సమ్మాన్ నిధి సహాయం రూ.6,000 నుంచి రూ. 9,000కు పెంపు
మత్స్యకారుల సహాయం రూ.4,500 నుంచి రూ.9,000 కు పెంపు
అన్ని పంటలకు MSP హామీ
అత్యంత వెనుకబడిన వర్గాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం
వ్యవసాయ మౌలిక సదుపాయాల్లో లక్ష కోట్ల పెట్టుబడి
ప్రతి సబ్ డివిజన్‌లో ఎస్సీ కేటగిరీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు
ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న అన్ని ఎస్సీ విద్యార్థులకు నెలకు 2,000 సాయం
పేద కుటుంబాల విద్యార్థులకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు పోషకమైన అల్పాహారం
50 లక్షల కొత్త పక్కా ఇళ్లు, ఉచిత రేషన్, 125 యూనిట్ల ఉచిత విద్యుత్, సామాజిక భద్రతా పెన్షన్
జిల్లాలోని ప్రధాన పాఠశాలలను పునరుద్ధరించడానికి 5,000 కోట్లు కేటాయిస్తామని హామీ
7 ఎక్స్‌ప్రెస్‌వేలు, 3,600 కి.మీ రైలు పట్టాల ఆధునీకరణ
ప్రతి జిల్లాలో ప్రపంచ స్థాయి మెడిసిటీ వైద్య కళాశాల నిర్మాణం
జానకి జన్మస్థలాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక నగరంగా ‘సీతాపురం’గా అభివృద్ధి
పాట్నా, దర్భంగా, పూర్నియా భాగల్పూర్‌లలో అంతర్జాతీయ విమానాశ్రయాలు 4 కొత్త నగరాల్లో మెట్రో నిర్మాణానికి హామీ.

ఇటీవల ఇండియా కూటమి కూడా మేనిఫెస్టో విడుదల చేసింది. 32 పేజీల మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి చట్టం చేయనున్నట్లు ప్రకటించింది. ఇక జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్)లను పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పిస్తామని తెలిపింది. నెలకు రూ. 30,000 వేల జీతం ఇస్తామని వెల్లడించింది.

బీహార్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఒకరు అధికారం నిలబెట్టుకునేందుకు.. ఇంకొకరు అధికారం కోసం పోరాటం చేస్తున్నారు.

Exit mobile version