NTV Telugu Site icon

Himanta Biswa Sarma: యూసీసీ అమలు, పీఓకే కోసం ఏన్డీయే 400 సీట్లు గెలవాలి..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేయడానికి, మథురలో శ్రీకృష్ణ జన్మస్థాన్‌లో గొప్ప ఆలయాన్ని నిర్మించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలవాలని అస్సా సీఎం హిమంత బిశ్వ సర్మ శనివారం అన్నారు. బెగుసరాయ్‌లో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తరుపున ఆయన ప్రచారం నిర్వహించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రతిపక్షాల తీరును ఆయన నిందించారు. పీఓకేకు భరోసా కల్పించేందుకు ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే 400 సీట్లు గెలవాలని, పీఓకే భారత్‌కి తిరిగి వస్తుందని అన్నారు.

Read Also: UP: రెండేళ్లుగా యువతిపై అత్యాచారం.. వీడియోలు తీసి మరి బ్లాక్‌మెయిల్

‘‘కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరియు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ అయోధ్యలో రామ్ లల్లా యొక్క ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాలేదు. నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను రాహుల్, లాలూ ఎప్పటికీ అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించగలరా.?’’ అని అడిగారు. మత ఆధారిత రిజర్వేషన్లను కాంగ్రెస్ కల్పిస్తోందని దుయ్యబట్టారు. ఇండియా కూటమి నాయకులు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, పాకిస్తాన్‌కి మద్దతు ఇచ్చే లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, పీఓకే సమస్య లేవనెత్తొద్దని చెబుతున్నాడని, అయితే, ఆ బాంబుల గడువు తీరిపోయిందని తాను విశ్వసిస్తున్నట్లు హిమంత అన్నారు.

కేంద్రంలోని మా ప్రభుత్వం పీఓకే భారత్‌కి చెందినదని, దానిని ఏ శక్తి లాక్కోలేదని చెబుతోందని, పీఓకే భారత్‌కి తిరిగి వచ్చేలా ప్రధాని మోడీకి మూడోసారి అధికారం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ఎన్డీయే ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగించినందున, రాబోయే కాలంలో పీఓకే భారత్ తిరిగి వచ్చేలా చేస్తుందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ/ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింకు కోటా ఇచ్చిందని, దీన్ని దేశం మొత్తం చేయాలని ఆ పార్టీ భావిస్తోందని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లను బీజేపీ ఎప్పటికీ అంగీకరించదని చెప్పారు. బీహార్‌లోని బెగుసరాయ్, దర్భంగా, ఉజియార్‌పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్ లోక్‌సభ స్థానాలకు నాలుగో దశలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.