NTV Telugu Site icon

Women’s Day: “మహిళలు ఒక హత్య చేస్తే శిక్షించవద్దు”.. రాష్ట్రపతికి సంచలన లేఖ..

President Droupadi Murmu

President Droupadi Murmu

Women’s Day: మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్సీపీ -శరద్ పవార్ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంచలన లేఖ రాశారు. మహిళలు అణచివేత మనస్తత్వం, అత్యాచార మనస్తత్వం, నిష్క్రియాత్మక శాంతిభద్రత ధోరణిని చంపాలనుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ముంబైలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారాన్ని లేఖలో ఖడ్సే పేర్కొన్నారు.

Read Also: Singer Kalpana: మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ను కలిసిన సింగర్ కల్పన.. వారిపై ఫిర్యాదు

‘‘మహిళలు ఒక హత్య చేస్తే వారికి శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాము’’ అని ఖడ్సే లేఖలో పేర్కొన్నారు. మహిళలకు ఒక హత్యకు శిక్ష నుంచి ఇమ్యూనిటీ ఇవ్వాలని కోరారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలను టార్గెట్ చేస్తూ ఆమె, రాష్ట్రపతికి ఈ లేఖ రాశారు. కిడ్నాప్, గృహ హింస వంటి నేరాలు మహిళలకు అత్యంత సురక్షితం కాని దేశం భారతదేశం అని పేర్కొన్న ఒక సర్వే నివేదికను కూడా ఆమె ఉదహరించారు. మా డిమాండ్‌ని తీవ్రంగా ఆలోచించిన తర్వాత అనుమతి మంజూరు చేస్తారని మేము ఆశిస్తున్నామని ఖడ్సే లేఖలో అన్నారు.