Site icon NTV Telugu

NCP Meet: రేపు శాసనసభా పక్ష సమావేశం.. ఆమెకే బాధ్యతలు అప్పగించే ఛాన్స్!

Ncp

Ncp

అజిత్ పవార్ అకాల మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. ఇక ఎన్‌సీపీని ముందుండి నడిపించేది ఎవరు? అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఎన్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. అయితే అజిత్ పవార్ కుమారులు అంత ఆసక్తిగా లేకపోవడంతో ఆయన భార్య సునేత్రా పవార్‌నే నాయకురాలిగా ఎంచుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అజిత్ పవార్ నిర్వహించిన పోస్టులన్నీ ఎన్‌సీపీ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్లు.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో చర్చలు జరిపారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంతో పాటు ఆర్థిక శాఖ, మరిన్ని శాఖలు నిర్వహించారు. ఆ శాఖలన్నీ ఎన్‌సీపీ నిలబెట్టుకోవాలని భావిస్తోంది.

ఇదిలా ఉంటే ఎన్‌సీపీ తిరిగి పున:కలయిక కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎన్‌సీపీ ఒక్కటి చేసేందుకు రెండు వర్గాల నాయకులు వచ్చే వారం సమావేశం కానున్నట్లు వర్గాలు తెలిపాయి.
నాయకత్వం వహించేందుకు ముగ్గురు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ భార్య సునేత్ర, సుప్రియ సూలే, ప్రఫుల్ పటేల్‌లో ఎవరొకరు నాయకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం.

1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత శరద్ పవార్ ఎన్‌సీపీని స్థాపించారు. అనంతరం అజిత్ పవార్ జూలై 2023లో పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆయన వర్గం అధికార మహాయుతిలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బాల్, దిలీప్ వాల్సే-పాటిల్ వంటి శరద్ పవార్ సన్నిహితులు కూడా అజిత్ పవార్ శిబిరంలో చేరారు. తాజాగా అజిత్ పవార్ చనిపోవడంతో తిరిగి కలిసి కోవాలని నేతలు భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Exit mobile version