Ajit Pawar: మహారాష్ట్రలోని పూణెలో జరిగిన లిఫ్ట్ ప్రమాదం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అజిత్ పవార్ తృటిలో తప్పించుకున్నారు. నగరంలోని హార్దికర్ హాస్పిటల్‌లోని నాల్గవ అంతస్తు నుండి లిఫ్ట్ పడిపోయినప్పుడు ఎన్‌సీపీ నాయకుడు, మరో ముగ్గురితో కలిసి లిఫ్ట్‌లో ఉన్నారు. ఈ ప్రమాదంలో వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు మరియు ఎలాంటి గాయాలు కాకుండా లిఫ్ట్ నుండి బయటకు వచ్చారు. అయితే, ఆ విషయం కాస్త ఆలస్యంగా ఆజిత్ పవార్ బయటపెట్టారు.. ఆదివారం బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడుతూ, పుణెలోని ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఆ సమయంలో నాతో పాటు 90 ఏళ్ల డాక్టర్ రెడీ కర్ కూడా లిఫ్ట్‌లో ఉన్నారని.. నాల్గవ అంతస్తుకి లిఫ్ట్‌లో వెళుతుండగా అకస్మాత్తుగా కరెంటు పోయింది.. చిమ్మచీకటి.. ఆ సమయంలో ఏమీ అర్థం కాలేదు.. అదే సమయంలో నాల్గో అంతస్తు నుంచి లిఫ్ట్ కిందికి పడిపోయిందన్నారు.. నాతో పాటు ఉన్న వ్యక్తి లిఫ్ట్ డోర్లను బలవంతంగా తెరిచి నన్ను బయటకు లాగాడు.. ఆ తర్వాత డాక్టర్‌ను కాపాడాం.. ఈ ప్రమాదంలో నాకు ఎలాంటి గాయాలు కాలేదు. డాక్టర్ హార్దికర్‌కు స్వల్ప గాయాలు అయినట్టు వెల్లడించారు.. అయితే, ఇదేదో కథ కాదు.. నేను అబద్ధం చెప్పడం లేదు. మాకు ఏమైనా అయ్యింటే ఈ రోజు ఇది శ్రద్ధాంజలి కార్యక్రమంగా ఉండేదన్నారు.. ఈ విషయం నేను దాచుకోలేకపోతున్నాను.. మీరు కూడా నా కుటుంబ సభ్యులే. అందుకే ఈ విషయం మీతో చెప్పాను’ అని అజిత్ పవార్ చమత్కరించారు.. ఈ విషయాన్ని ఇంట్లో తన భార్యకు, తల్లికి సైతం చెప్పలేదన్నారు. ముందే, ఈ విషయం అందరికి చెప్పి ఉంటే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయ్యేదన్నారు.. ఈ ఘటన జనవరి 14వ తేదీన పుణెలో జరిగినట్లు తెలిపారు అజిత్ పవార్.