NTV Telugu Site icon

Drug Mumbai: రూ.120 కోట్ల విలువచేసే డ్రగ్స్​​ స్వాధీనం.. ఎయిర్ ఇండియా మాజీ పైలట్ అరెస్ట్

Drug Mumbai

Drug Mumbai

Drug Mumbai: మహారాష్ట్రలోని ముంబైలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ (ANC) 50 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది. ముంబై గోడౌన్‌లోని అంతర్జాతీయ మార్కెట్‌పై దాడులు చేసిన అధికారులు 50 కిలోల మెఫిడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.120 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

అరెస్టయిన సోహైల్ గఫార్ అనే పైలట్ ఒకప్పుడు ఎయిర్ ఇండియాలో పనిచేశాడు. యుఎస్‌లో శిక్షణ పొందిన సోహైల్ గఫార్ కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణాలు చూపుతూ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. అదే డ్రగ్ కార్టెల్ మార్కెట్‌లో దాదాపు 225 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్స్‌ను విక్రయించగా, అందులో 60 కిలోలు నిన్న స్వాధీనం చేసుకున్నట్లు యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.
ముంబైలో డ్రగ్స్‌ దందా జరిగిందని జామ్‌నగర్‌లో నేవల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు సోదాలు నిర్వహించామని తెలిపారు.

ఈ ఏడాది ప్రారంభంలో గుజరాత్‌లో భారీ స్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడ్డాయి.ఆగస్టులో వడోదరలో 200 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఏప్రిల్‌లో కాండ్లా ఓడరేవులో 260 కిలోల డ్రగ్స్‌ పట్టుబడ్డాయి.
గత సెప్టెంబర్‌లో ముంద్రా ఓడరేవులో 21,000 కోట్ల రూపాయల విలువైన 3000 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Rupee Hits Fresh Record Low: ఆల్‌ టైమ్‌ కనిష్ఠ స్థాయికి రూపాయి.. 82 మార్క్‌ కూడా దాటేసింది..

Show comments