NTV Telugu Site icon

టౌటే బీభ‌త్సం: తీరంలో చిక్కుకున్న 410 మంది.. రంగంలోకి నేవీ…

Ships

టౌటే తుఫాన్ బీభ‌త్సం సృష్టిస్తోంది… ఇప్ప‌టికే తుఫాన్ పంజాకు మహారాష్ట్ర, గోవా, గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాలు వ‌ణికిపోతున్నాయి.. ముంబైలో ప‌రిస్థితి అత‌లాకుత‌లంగా మారిపోయింది… ఓవైపు భారీ వ‌ర్షాలు, మ‌రోవైపు గంటకు 180 కిలోమీట‌ర్ల‌కు పైగా వేగంతో ఈదురు గాలుల‌తో ప‌రిస్థితి భ‌యంక‌రంగా మారింది. గుజరాత్‌లోని పోరుబందర్‌- మహువా మధ్య ఈ రాత్రికి తుఫాన్ తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ అంచ‌నా వేసింది. మ‌రోవైపు.. టౌటే తుఫాన్ ప్ర‌భావంతో.. అరేబియా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారిపోయాయి.. రాకాసి అల‌లు ఎగిసిప‌డుతున్నాయి. బ‌ల‌మైన గాలుల ధాటికి ముంబై ప‌శ్చిమ తీరంలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయిన‌ట్టు చెబుతున్నారు.. ఈ నౌక‌లో ఏకంగా 273 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్టుగా తెలుస్తోంది… మ‌రికొంత‌మందినో మ‌రో నౌక‌కూడా మిస్ అయిన‌ట్టు తెలుస్తోంది.. మొత్తంగా రెండు నౌక‌ల్లో 410 మంది ఉన్న‌ట్టుగా అంచ‌నా వేస్తున్నారు.. ముంబై తీరంలో చిక్కుకున్న 410 మందిని రక్షించడానికి భారత నావికాదళం మూడు నౌకలను మోహరించింది.

మొదటి ముంబై నుండి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొంబాయి హై ఫీల్డ్స్ ఆఫ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) వద్ద హీరా ఆయిల్‌ఫీల్డ్ సమీపంలో డ్రిఫ్టింగ్ బార్జ్‌లో 273 మంది ఇబ్బందులు ప‌డ్డారు.. సిబ్బంది మరియు ఒఎన్‌జిసి సిబ్బందితో చమురు క్షేత్రాల దగ్గర కొట్టుమిట్టాడుతున్న బార్జ్ పి 305 నుండి వచ్చిన ఒక ఎస్‌వోఎస్ తరువాత, భారత నావికాదళం ఐఎన్ఎస్ కొచ్చి మరియు ఐఎన్ఎస్ తల్వార్ అనే రెండు నౌకలను పంపించి సహాయం అందిస్తోంది.. మ‌రోవైపు.. బార్జ్ జీఏఎల్ కన్స్ట్రక్టర్ కు చెందిన నౌక‌లో 137 మంది ఉన్న‌ట్టుగా చెబుతున్నారు.. మొత్తంగా అంద‌రినీ కాప‌డ‌డానికి రంగంలోకి దిగింది ఇండియ‌న్ నేవీ..