NTV Telugu Site icon

New Parliament: ఇది ప్రజాస్వామ్యానికి అవమానం.. విపక్షాల బహిష్కరణపై ఎన్డీయే ఆగ్రహం

New Parliament.

New Parliament.

New Parliament: మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆప్, టీఎంసీతో సహా 19 పార్టీలు బహిష్కరించాయి. ఈ ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర ఆహ్వానం మేరకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పార్టీ బిజూజనతా దళ్(బీజేడీ), అకాలీదళ్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించాయి.

Read Also: Naveen Patnaik: విపక్షాలకు షాక్.. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామన్న బీజేడీ..

ఇదిలా ఉంటే విపక్షాల బహిష్కరణపై బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్(ఎన్డీయే) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ చర్య గౌరవం కలిగించేది కానది, ఇది మన గొప్పదేశ ప్రజాస్వామ్య నీతి, రాజ్యంగ విలువకు అవమానం అని పేర్కొంది. ప్రతిపక్షాల చర్యలను మేధోపరమైన దివాళాగా అభివర్ణించింది. ప్రజాస్వామ్యానికి ధిక్కారంగా, ద్రోహంగా పేర్కొంది. ప్రతిపక్షాల చర్యలకు ఇది మొదటి ఉదాహారణ కాదని.. గత తొమ్మిదేళ్లుగా కీలకమై చట్టాల సమయంలో వాకౌట్ చేయడం, పార్లమెంటరీ విధుల పట్ట లోపభూయిష్ట వైఖరి ప్రదర్శిస్తున్నాయని విమర్శించింది. ప్రజాస్వామ్య ప్రక్రియను పట్టించుకోకుండా ఇలా పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడం వీరి మరో చర్య అని ఎన్డీయే ప్రకటనలో పేర్కొంది.

Show comments