Smriti Irani Slams Rahul Gandhi: ఇటీవల లండన్ వేదికగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. విదేశీ గడ్డపై భారతదేశ పరువు తీశారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి సంస్థలను ఆయన అగౌరపరిచారని అన్నారు. భారతదేశాన్ని అవమానించడం ప్రజాస్వామ్యామా..? సభాపతిని అగౌరపరచడం ప్రజాస్వామ్యామా.? అని ఆమె రాహుల్ గాంధీని ప్రశ్నించారు. వెంటనే రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గాంధీ కుటుంబం ఆదేశాల మేరకు కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటులో స్పీకర్ చైర్ వద్దకు వెళ్లి, కాగితాలు చింపివేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. భారత ప్రజల గొంతుకగా ఉన్న పార్లమెంట్ నుంచి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశానికి క్షమాపణలు చెప్పే బదులు ఆయన సభకు గౌర్హాజరు కావాలని అనుకుంటున్నారని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.
Read Also: IND vs AUS ODI Series: టీమిండియాకు భారీ దెబ్బ.. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ ప్లేమర్ దూరం!
రాహుల్ గాంధీ భారతదేశ యూనివర్సిటీల్లో మాట్లాడేందుకు అవకాశమే లేదని అంటున్నారని.. 2016లో ఢిల్లీ నడిబొడ్దున ఉన్న యూనివర్సిటీలో భారత్ ను ముక్కలు చేస్తామని అంటే, వారికి మీరు మద్దతుగా నిలబడిన సంగతి మరిచారా..? అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న రాహుల్ గాంధీ ద్వేషం ఇప్పుడు దేశంపై ద్వేషంగా మారిందని ఆమె అన్నారు. భారత దేశాన్ని బానిసగా చూసిన ఓ దేశాన్ని సందర్శించి విదేశీ శక్తలను రెచ్చగొడుతున్నారని అన్నారు.
ఇటీవల లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో జరిగిన ఉపన్యాసంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్యం ఒత్తడిలో ఉందని, దాడి జరుగుతోందని అన్నారు. దేశంలో న్యాయవ్యవస్థ, పత్రికల స్వేచ్చపై దాడి జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు ఒత్తడి ఎదుర్కొంటున్నారంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోరని కాంగ్రెస్ అంటోంది.