Naroda Patiya riots case convict’s daughter gets BJP ticket to fight Gujarat polls: గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. బీజేపీతో పాటు పలు కాంగ్రెస్, ఆప్ పార్టీలు తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. డిసెంబర్ 1, 5న రెండు విడతల్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. టికెట్ల కేటాయింపులో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు టికెట్ కేటాయించింది. ఇదిలా ఉంటే గుజరాత్ మోర్బీ ఘటనలో 140కి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనలో ప్రాణాలు లెక్కచేయకుండా చాలా మందిని కాపాడి మోర్బీ హీరోగా నిలిచిన కాంతీలాల్ అమృతియా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బీజేపీ అందర్ని ఆశ్చర్యపరిచింది.
Read Also: Governor Tamilisai : ఓ మహిళ కుటుంబంలో ఆనందం నింపిన గవర్నర్ ట్వీట్
ఇదిలా ఉంటే నరోడా పాటియా అల్లర్లలో దోషిగా ఉన్న వ్యక్తి కుమార్తెకు గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈ కేసులో దోషిగా ఉన్న మనోజ్ కుక్రానీ కూతురు పాయల్ గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేయనున్నారు. 2002 నరోడా పాటియా అల్లర్ల కేసులో దోషి మనోజ్ కక్రానీగా తేలాడు. ఆయనక జీవిత ఖైదు శిక్ష పడింది. ప్రస్తుతం మనోజ్ బెయిల్ పై ఉన్నాడు. పాయల్ కుక్రానీ అనస్థీషియా నిపుణురాలు. బీజేపీకి చెందని అతి పిన్న వయస్కురాలు. పాయల్ తల్లి రేష్మ కుక్రానీ అహ్మదాబాద్ లోని సైజ్ పూర్ కార్పొరేటర్ గా ఉన్నారు.
పాయల్ మాట్లాడుతూ.. పార్టీ నాపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మా నాన్న బీజేపీకి 40 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారని.. నా చదువు పూర్తయిన తర్వాత మా అమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని అన్నారు. పాయల్ తల్లి రేష్మ తన కూతరు పాయల్ భారీ మెజారిటీతో గెలుస్తుందని అన్నారు.
అయితే బీజేపీ తీరును కాంగ్రెస్ ప్రశ్నించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలోక్ వర్మ.. బీజేపీ వేరే అభ్యర్థిని ఎందుకు నిలబెట్టడం లేదు..? బీజేపీ ఇంతకాలం నుంచి చేస్తుందే ఇదే అని బీజేపీ నకిలీ హిందుత్వం ఇప్పుడు బట్టబయలైందని.. గుజరాత్ లో బీజేపీ గెలవదంటూ అని అన్నారు.
