Naroda Gam massacre: నరోదా గామ్ ఊచకోత కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు నిందితులంతా నిర్దోషులే అని కీలక తీర్పు వెలువరించింది. అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు గురువారం ఈ తీర్పును ప్రకటించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, మాజీ భజరంగ్ దళ్ నాయకుడు బాబు బజరంగి సహా మొత్తం 67 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో కోర్టు చెప్పిన తీర్పుపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కవి రహత్ ఇండోరి కవితను ఉటంకిస్తూ.. అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు.
‘‘మీరు ఎక్కడికెళ్లినా పొగపెడతారు, గందరగోళాన్ని సృష్టిస్తారు. సారవంతమైన నేలలో రక్తం చిందించే హక్కు రాజకీయాలు మీకు కల్పించాయి, మీరే అప్పీలు చేస్తారు, మీరే కేసు వాదిస్తారు, మీరే సాక్షి, మీరే న్యాయవాది. మీరు ఎవరినైనా దూషించే స్వేచ్ఛ ఉంది, ఎవరినైనా చంపడానికి స్వేచ్ఛ ఉంది’’ అని గురువారం రాత్రి అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఈ కేసులో మొత్తం 67 మంది నిందితులుగా ఉంటే కేసు విచారణ సమయంలో 18 మంది మరణించారు.
Read Also: Poonch Attack: పూంచ్ ఉగ్రదాడి మా పనే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటన..
నరోదా పాటియా కేసు ఏంటి..?
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఈ ఘటన జరిగింది. ఫిబ్రవరి 28,2002 గోద్రాలో సబర్మతి ఎక్స్ ప్రెస్ కు నిప్పటించిన ఘటనలో 58 మంది కరసేవకులు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత నరోదా గామ్ సంఘటన జరిగింది. అహ్మదాబాద్ లోని నరోదాగామ్ లో దాదాపు 11 మంది ముస్లిం గుంపు హత్యకు గుర్యయ్యారు. 2008లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్ ) 86 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది.
తాజాగా ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి శుభదా బాక్సీ గురువారం తీర్పు చెప్పారు. నిర్దోషులు బంధువులు తీర్పును స్వాగతించించారు. జైశ్రీరాం, భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేశారు. ముస్లింలు ఈ తీర్పును ఖండించారు.