Narendra Modi : బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బీహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించిందన్నారు. బీహార్‌లో సంక్షేమం, సామాజిక న్యాయం విజయం సాధించిందని, విజయంతో ఆశీర్వదించిన బీహార్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోడీ. బీహార్ తీర్పు నూతన సంకల్పంతో పని చేయడానికి శక్తినిచ్చిందని, అవిశ్రాంతంగా పని చేసిన ప్రతి ఎన్డీయే కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాల అబద్ధాలను మా కార్యకర్తలు తిప్పికొట్టారని ప్రధాని మోడీ ప్రశంసించారు. బీహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలు కొట్టారని, మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నామని మోడీ వ్యాఖ్యానించారు.
Babu Mohan : అది నన్ను జీవితాతం బాధిస్తోంది.. బాబు మోహన్ ఎమోషనల్
అంతేకాకుండా.. MY ఫార్ములా అంటే.. మహిళ -యూత్ ఫార్ములా అని, బీహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించిందన్నారు ప్రధాని మోడీ. బీహార్ ప్రజలు అద్భుత విజయం అందించారని, బీహార్‌లో ఇవాళ ప్రతీ ఇంట మఖానా పాయసం వండుకుని సంతోషిస్తారన్నారు ప్రధాని మోడీ. బీహార్‌లో జంగిల్‌రాజ్ అన్నప్పుడల్లా ఆర్జేడీ నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేదని, బీహార్‌లో ఆ జంగిల్‌రాజ్ ఎప్పటికీ తిరిగిరాదని మోడీ అన్నారు. బీహార్ ప్రజలు వికసిత్ భారత్‌కు ఓటేశారని, బీహార్‌లో ఎన్డీఏ అతిపెద్ద విజయం సాధించిందన్నారు. రికార్డుస్థాయిలో ఓటింగ్‌లో పాల్గొని ఎన్డీఏకు అద్భుత విజయం అందించారని ప్రధాని మోడీ అన్నారు.
Bihar Elections: బీహార్ రాజకీయాలను మలుపు తిప్పిన రో-కో జోడీ వీళ్లది!
