NTV Telugu Site icon

Jammu Kashmir: రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. నార్కో-టెర్రర్ కుట్ర భగ్నం..

Drugs

Drugs

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భారీ మాదకదవ్యాల కుట్ర భగ్నమైంది. నార్కో-టెర్రర్ కుట్రను పోలీసులు ఛేదించారు. రాంబన్ జిల్లాలో ఒక వాహనం నుంచి రూ. 300 కోట్ల విలువైన 30 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. శనివారం రాత్రి 10.30 గంటలకు సీనియర్ ఎస్పీ మోహిత్ శర్మ నేతృత్వంలో రాంబన్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కాశ్మీర్ నుంచి జమ్మూ వైపు వెళ్తున్న ఓ వాహనాన్ని రైల్వే చౌక్ బనిహాల్ వద్ద అడ్డుకున్నారు. వాహనంలో 30 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ డ్రగ్ విలువ రూ. 300 కోట్లు ఉంటుందని జమ్మూ జోన్ అదనపు డీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు.

Read Also: Uttar Pradesh: “నాపై చేతబడి చేస్తున్నారు”.. బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..

ఈ కేసులో ఇద్దరు పంజాబ్ వాసుల్ని అరెస్ట్ చేశారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్ చట్టం కింద కేసులు పెట్టినట్లు బనిహాల్ పోలీసులు వెల్లడించారు. రాంబన్ పోలీసులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో డ్రగ్ పెడ్లర్లు, స్మగ్లర్లపై కేసులు నమోదు చేసింది. తాజాగా ఈ కేసులో అరెస్టైన స్మగ్లర్లని జలంధర్ కి చెందిన సరబ్‌జీత్ సింగ్, ఫగ్వారాకు చెంది హనీ బస్రాగా గుర్తించారు. వాహనంపై భాగంలో మూడు కిలోలు, లగేజీలో 27 కిలోల డ్రగ్స్ ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైగ్రేడ్ కొకైక్ ని సరిహద్దు దాటించి ఉత్తర కాశ్మీర్ నుంచి పంజాబ్ తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Show comments