MUDA: ‘ల్యాండ్ స్కామ్’ వ్యవహారం కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం సిద్ధరామయ్య సతీమణి చేసిన ప్రకటన మేరకు ఆ భూముల్ని తిరిగి తీసుకునేందుకు ఒప్పకుంది. ఈ స్కామ్ లో ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారడంతో ఆ భూముల్ని వెనక్కి ఇచ్చేస్తామని ఆయన సతీమణి పార్వతి సంచలన ప్రకటన చేసింది.
Read Also: Central Government: 14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు రిలీజ్ చేసిన కేంద్రం
ఇక, అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ‘ముడా’కు చెందిన 14 ప్లాట్లు తిరిగి దానికే ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. మా అన్నయ్య పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఈ ప్లాట్లు ఇంత రాద్దాంతం చేస్తాయని అస్సలు ఊహించలేదని ఆమె చెప్పుకొచ్చారు. కాగా, నా భర్త గౌరవం, ఘనతకు మించి ఈ ఆస్తులు పెద్దవి ఏం కాదు.. ఇన్నేళ్లు ఆయన అధికారం నుంచి తాము ఏమీ ఆశించలేదు.. మాకు ఈ ఆస్తులు తృణప్రాయం అన్నారు. అందుకే ఈ స్థలాలను తిరిగి ముడాకు ఇచ్చేస్తున్నాను.. ఈ విషయం నా భర్తకు చెప్పలేదు.. నా కుటుంబ సభ్యులతోనూ చర్చించలేదన్నారు.
Read Also: Musi River : బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై మినిట్స్ విడుదల
అయితే, ఈ ఆరోపణలు వినిపించిన రోజే ఈ భూమిని ఇచ్చేద్దామనే నిర్ణయం తీసుకోవాలనుకున్నాను అని సిద్ధరామయ్య భార్య పార్వతి తెలిపింది. కానీ, నా భర్త రాజకీయ కుట్రలో మరింత నష్టపోతున్నాడని తెలిసి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నారు. అవసరమైతే దర్యాప్తునకు కూడా సహకరిస్తాను.. రాజకీయ రంగానికి దూరంగా ఉండే నాలాంటి మహిళలను దయచేసి వివాదాల్లోకి లాగొద్దు అని ఆమె కోరింది. ముఖ్యమంత్రి భార్య రాసిన లేఖపై ముడా అధికారులు స్పందించారు. భూములు వెనక్కి తీసుకునేందుకు అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు.