Site icon NTV Telugu

Rajasthan: అశోక్‌ గెహ్లాట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. నా రాజీనామా లేఖ సోనియా వద్దే..!

Ashok Gehlot

Ashok Gehlot

కాంగ్రెస్‌ పార్టీలో అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.. పలు సందర్భాల్లో సీఎం అశోక్‌ గెహ్లాట్, సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. అధిష్టానం జోక్యంతో చల్లబడినట్టు కనిపిస్తున్నా.. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ.. అక్కడ కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బంది పెడుతూనే ఉంది.. ఇక, సచిన్ పైలట్ గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాత.. సీఎం అశోక్‌ గెహ్లాట్ చేసిన ప్రకటన రాజస్థాన్ కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు తప్పదనే ఊహాగానాలకు ఊతమిచ్చినట్టు అయ్యింది.. అయితే, ఈ మధ్యే సచిన్ పైలట్ రెండుసార్లు పార్టీ అధినాయకత్వంతో సమావేశం కావడంతో గెహ్లాట్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Ukraine Russia War: శాంతి చర్చల్లో కీలక పరిణామం.. రంగంలోకి ఐరాస..

రాజస్థాన్‌ సీఎంను మార్చబోతున్నారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలపై స్పందించిన అశోక్‌ గెహ్లాట్.. తన రాజీనామా లేఖ సోనియా గాంధీ వద్దే ఉందని, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు పదవి నుంచి తీసేయొచ్చని అశోక్ గెహ్లాట్ తెలిపారు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ సందర్భంగా తన పదవి గురించి వస్తున్న ఊహాగానాలు నమ్మొద్దని కోరారు. కాగా, రాజస్థాన్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకంటే ముందే అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ అధిష్టానం పదవి నుంచి తప్పిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో, నా రాజీనామా సోనియా గాంధీ దగ్గర ఉంది కాబట్టి సీఎంని మార్చుతారా? అని పదే పదే అడిగే ప్రసక్తే లేదు.. ముఖ్యమంత్రి మారాల్సి వచ్చినప్పుడు మారుతారని, దాని గురించి ఎవరికీ తెలియదని స్పష్టం చేశారు అశోక్‌ గెహ్లాట్‌.

Exit mobile version