పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు శివసేన(యూబీటీ)కి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు మహాయుతి కూటమిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి పరాజయంతో చతికిలపడింది. దీంతో నేతలు నిరాశలోకి వెళ్లిపోయారు. అయితే పార్లమెంట్ బడ్జె్ట్ సమావేశాలకు ముందు ఉద్ధవ్ థాక్రేకుచెందిన ఎంపీలు గట్టు దాటే సూచనలు ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Gandhi Tatha Chettu Review: గాంధీ తాత చెట్టు రివ్యూ.. సుకుమార్ కూతురు సినిమా ఎలా ఉందంటే?
షిండే పార్టీకి చెందిన మంత్రి ఉదయ్ సమంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్ధవ్ థాక్రే పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలోనే శివసేన (షిండే) గ్రూపులో చేరబోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 24 నుంచే ఈ చేరికల పర్వం మొదలవుతోందని తెలిపారు. షిండే నేతృత్వంలోని శివసేనలో కొందరు చేరతారని… ఆ తర్వాత మరికొందరు వస్తారన్నారు. ఎంవీఏ నేతల చేరికపై కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు.
డిసెంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. అధికారంలోకి వస్తామని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఫలితాలు వచ్చేనాటికి చతికిలపడింది. దీంతో అధికారంలో ఉన్న మహాయుతిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చేరికలు ఉంటాయని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Gudivada Amarnath: దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్.. తీవ్ర వ్యాఖ్యలు