హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హాస్యనటుడు మునావర్ ఫరూఖీని అంతమొందించాలని సెప్టెంబర్‌లోనే బిష్ణోయ్ గ్యాంగ్ ఫ్లాన్ చేసింది. కానీ తృటిలో అతడు తప్పించుకున్నట్లుగా తాజా విచారణలో వెల్లడైంది. మునావర్ ఫరూఖీని మట్టుబెట్టి లారెన్స్ బిష్ణోయ్ తనకు తానుగా ‘‘హిందూ అండర్ వరల్డ్ డాన్’’గా ముద్ర వేయించుకోవాలని అనుకున్నట్లుగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Rekha Boj: ఇంకో జన్మ ఎత్తినా మారరు.. తెలుగు దర్శకనిర్మాతలపై హీరోయిన్ ఫైర్
మునావర్ ఫరూఖీ ముంబై నుంచి విమానంలో ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాడు. అదే విమానంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు అనుచరులు కూడా ఉన్నారు. మునావర్ కదలికలను గమనిస్తూ వెంబడించారు. ఢిల్లీలో ఫరూఖీ బస చేసే హోటల్‌లోనే గదులు కూడా బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతడిపై దాడికి ముందే ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి పోలీసులకు నివేదిక అందడంతో పోలీసులు రక్షించి ముంబైకి తరలించినట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే మునావర్ ఫరూఖీ ఇప్పటికీ హిట్‌లిస్టులో ఉన్నట్లుగా సమాచారం. అదునుచూసి చంపేందుకు గ్యాంగ్ ప్రణాళిక రచించినట్లుగా ముంబై పోలీసులు గుర్తించడంతో ఫరూఖీకి పోలీసులు భద్రత కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: IAS Officers : తెలంగాణాలోనే ఉంటాం.. కేంద్ర పరిపాలన ట్రెబ్యూనల్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు
ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ముంబై తీవ్ర కలకలానికి గురైంది. ఈ హత్యలో ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఇక పోలీసుల విచారణలో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిష్ణోయ్ గ్యాంగ్ లిస్టులో సిద్ధిఖీ కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ ఉన్నట్లు తేలింది. హిట్‌లిస్టులో మరికొందరి పేర్లు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి.
లారెన్స్ బిష్ణోయ్ అండర్ వరల్డ్ డాన్ కావాలనే కోరికతోనే బాబా సిద్ధిఖీని చంపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా సల్మాన్ ఖాన్‌తో సాన్నిహిత్యము కూడా ఈ హత్యకు ఓ కారణంగా పోలీసులు అనుమానిస్తు్న్నారు. ఆ దిశగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Oviya Leaked Video: హీరోయిన్ ప్రయివేట్ వీడియో లీక్.. లింక్ అడిగిన నెటిజన్ కి షాకింగ్ సమాధానం