Site icon NTV Telugu

Truck: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ప్రమాదం.. 20 కార్లను ఢీకొట్టిన ట్రక్కు..

Mumbai Pune

Mumbai Pune

Truck: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌గఢ్ జిల్లాలోని ఖోపోలి సమీపంలో అదుపు తప్పిన ట్రక్కు 20 వాహనాలను ఢీకొట్టింది. కంటైనర్ ట్రక్కు ఘాట్ సెక్షన్‌లో వాలు నుంచి దిగుతుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ సంఘటన జరిగింది. నియంత్రణ కోల్పోయిన ట్రక్కు ముందున్న పదుల సంఖ్యలో వాహనాలనపు ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొనడంతో పలు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే చాలా మంది గాయపడ్డారు.

Read Also: Srushti IVF Center : తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ప్రకంపనలు.. వెలుగులోకి సంచలన విషయాలు

ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి లగ్జరీ కార్లు కనీసం 20 దెబ్బతిన్నాయి. 19 మంది గాయపడ్డారు. వీరిని నవీ ముంబైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ట్రక్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమయంలో డ్రైవర్ మద్యం తీసుకోలేదని వైద్య పరీక్షలో తేలింది. తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Exit mobile version