Site icon NTV Telugu

Terror Threats In Mumbai: ముంబైకి ఉగ్రముప్పు హెచ్చరికలు.. అధికారులు అలర్ట్..!

Mumbai

Mumbai

Terror Threats In Mumbai: దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహా నగరానికి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేశారు. ప్రార్థనా మందిరాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాక్‌ డ్రిల్స్‌ కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. వివిధ నగరాలకు చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీలు) తమ జోన్లలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగుతున్నట్లు తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు. వివిధ ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

Read Also: Israel Attacks : ఎవరూ బతికిలేరు… హెజ్ బొల్లా హెడ్‌క్వార్టర్స్‌లో దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రకటన

అలాగే, ముంబయిలోని రెండు ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్న క్రాఫోర్డ్ మార్కెట్ ఏరియాలో పోలీసులు మాక్ డ్రిల్ చేశారు. ముంబయిలో ప్రతిఏటా దుర్గాపూజ, దీపావళి పండగలను ఘనంగా జరుపుకుంటారు. ఈ టైంలో ఉగ్రముప్పు హెచ్చరికలు రావడంతో ప్రజలు అలర్టుగా ఉండాలని అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

Exit mobile version