NTV Telugu Site icon

Salman Khan: సల్మాన్ ఖాన్‌ని చంపేస్తామని బెదిరింపు.. నిందితుడి అరెస్ట్..

Salman Khan

Salman Khan

Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి ఇటీవల కాలంలో బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. బిష్ణోయ్ కమ్యూనిటీకి అత్యంత ఆరాధనీయమైన కృష్ణజింకల్ని వేటాడిని కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సల్మాన్ ఖాన్‌కి అత్యంత సన్నిహితుడు, ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిక్‌ని బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ టార్గెట్‌గా పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Read Also: Tollywood : సంక్రాంతిని సీజన్ ను తలపిస్తున్న టాలివుడ్…

ఇటీవల ఒక వ్యక్తి తనకు డబ్బులు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ని చంపేస్తానని బెదిరించాడు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఓ మెసేజ్ వచ్చింది. తనకు రూ. 2 కోట్లు ఇవ్వాలని అతను డిమాండ్ చేశాడు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని ముంబైలో అరెస్ట్ చేశారు. నిందితుడిని ముంబై బాంద్రా ఈస్ట్‌కి చెందిన ఆజం మహ్మద్ ముస్తాఫా అనే వ్యక్తిగా గుర్తించారు.

అంతకుముందు, మంగళవారం, నోయిడా ఇలాగే ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్, బాంద్రా తూర్పు ఎన్‌సిపి ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్‌కు బెదిరింపులు జారీ చేసినందుకు 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఇటీవల హత్యకు గురైన బాబా సిద్ధిక్ కుమారుడే జీషన్ సిద్ధిక్. మహ్మద్ తయ్యబ్ అనే నిందతుడు ఇలాగే జీషాన్, సల్మాన్ ఖాన్ నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు.

Show comments