NTV Telugu Site icon

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా మృతిలో బీజేపీ నేతకు పోలీసుల సమన్లు..

Sushant Singh Rajput

Sushant Singh Rajput

Sushant Singh Rajput: బాలీవుడ్ స్టార్, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణేకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. శుక్రవారం తమ ముందు హాజరుకావాలని నోటీసలు పంపారు. 2020లో సుశాంత్ మరణించిన తర్వాత అతని మాజీ మేనేజర్ దిశా మరణించింది. ఈ కేసులోనే బీజేపీ నేతకు సమన్లు జారీ అయ్యాయి. దిశ మృతి హత్య అని, ఆమె హత్యకు గురైందని రాణే పేర్కొన్నారు.

Read Also: Poonam Kaur: ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు.. వైరల్ అవుతున్న పూనమ్ కౌర్ ట్వీట్

ఎమ్మెల్యే నితీస్ రాణేని మాల్వానీ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని పోలీసులు కోరారు. హత్యకు గురైందనే వాదనకు సంబంధించి కీలక విషయాలు, ఏదైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని పోలీసులు కోరవచ్చు. ‘‘నాకు ఇప్పుడే సమన్లు అందాయి. ఇది హత్య కేసు అని నేను మొదటి రోజు నుంచి చెబుతున్నాను. నేను ముంబై పోలీసులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను.గత మహావికాస్అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం ఆదిత్య ఠాక్రే. అతని స్నేహితులని రక్షించాలని అనుకుంది. నా వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా, పోలీసులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని నితీష్ రాణే తెలిపారు.

ముంబైలోని సబర్బన్ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరివేసుకుని మరణించాడు. దీనికి కొన్ని రోజుల ముందు అతని జూన్ 8, 2020లో దిశ చనిపోయింది. మృతిపై దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీసులు గతేడాది ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ కేసును ముంబై పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా నమోదు చేశారు.