Site icon NTV Telugu

ముంబైవాసుల‌కు గుడ్ న్యూస్‌: ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రు నుంచి…

గ‌త నెల‌రోజులుగా మ‌హారాష్ట్ర‌ను క‌రోనా ఇబ్బంది పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు భారీగా త‌గ్గిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు అన్ని రంగాలు ఓపెన్ అయ్యాయి. కేసులు పెద్ద సంఖ్య‌లో త‌గ్గిపోవ‌డంతో చాలా వ‌ర‌కు నిబంధ‌న‌ల‌ను స‌డ‌లిస్తూ వ‌స్తున్నారు. త్వ‌ర‌లోనే పూర్తిస్తాయిలో నిబంధ‌న‌లు స‌డ‌లించే అవ‌కాశం ఉన్న‌ట్టు ముంబై మేయ‌ర్ ప్ర‌క‌టించారు. ఈ నెలాఖ‌రు నుంచి పూర్తిస్థాయిలో నిబంధ‌న‌లు స‌డ‌లించ‌నున్నారు. అయితే, త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాల‌ని, సోష‌ల్ డిస్టెన్స్ వంటివి పాటించాల‌ని మేయ‌ర్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ముంబైలో కేసులు 400 లోపే న‌మోద‌వుతున్నాయి. సుమారు 50 రోజుల త‌రువాత కేసులు భారీగా త‌గ్గ‌డంతో అధికారులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్ స‌మ‌యంలో రోజుకు 20 వేల వ‌ర‌కు కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌రువాత క్ర‌మంగా కేసులు త‌గ్గుతూ వ‌చ్చాయి.

Read: అదృష్టం: ఒక్క‌రాత్రిలోనే ఆ 31 కుటుంబాలు కోట్లకు అధిప‌తుల‌య్యాయి…

Exit mobile version