NTV Telugu Site icon

BMW hit and run case: యాక్సిడెంట్ తర్వాత 40 సార్లు లవర్‌కి ఫోన్.. మిహిర్ షాకి 7 రోజుల కస్టడీ..

Bmw Hit And Run Case

Bmw Hit And Run Case

BMW hit and run case: మహారాష్ట్ర రాజకీయాల్లో బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు చర్చనీయాంశంగా మారింది. అధికార శివసేన పార్టీకి కీలక రాజేష్ షా కుమారుడు మిహిర్ షా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని వర్లీ ప్రాంతంలో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడిపి 45 ఏళ్ల కావేరీ నఖ్వా అనే మహిళ మరణానికి కారణమయ్యాడు. ఘటన జరిగిన 72 గంటల తర్వాత మిహిర్ షాని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: IAS: ట్రైనీ ఐఏఎస్ ఓవరాక్షన్.. మూల్యం చెల్లించుకున్న అసిస్టెంట్ కలెక్టర్‌

యాక్సిడెంట్ చేసిన తర్వాత మిహిర్ షా సంఘటన స్థలం నుంచి తన ప్రియురాలు ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెతో 40 సార్లు మాట్లాడాడు. ప్రస్తుతం ఈమెను కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవచ్చని పోలీసులు తెలిపారు. చేపల వ్యాపారం చేసే ప్రదీప్ నఖ్వా, కావేరీ నఖ్వాలు ప్రయాణిస్తున్న స్కూటర్‌ని కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రదీప్ బానెట్‌పై పడ్డాడు. కావేరీ కారు చక్రాల కింద పడటంతో కారు 1.5 కి.మీ మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదం సమయంలో మిహిర్ షా మద్యం మత్తులో ఉన్నాడు. కారుని కాలా నగర్ తీసుకెళ్లి, ఆధారాలు చెరిపే ప్రయత్నం చేశారు. ఇందుకు అతని డ్రైవర్ రాజ్ రిషిబిదావత్ సహకరించారు. ఆ తర్వాత ఆటో ఎక్కి తన ప్రియురాలు ఇంటికి వెళ్లాడు.

ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితుడు తండ్రి రాజేష్ షాని శివసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు నిన్న అరెస్టైన మిహిర్ షాని కోర్టు ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. ఈ కేసులో మిహిర్ పరారయ్యేందుకు అతడి తల్లి, ఇద్దరు సోదరిణులు సాయం చేశారని అధికారులు అనుమానిస్తున్నారు. కారు ప్రమాద సమయంలో డ్రైవర్ రాజరిషి బిదావత్‌ని కారు తన కొడుకు మిహిర్ షాకు అప్పగించాలని తండ్రి రాజేష్ షా చెప్పినట్లు తెలిసింది.