Site icon NTV Telugu

Mukesh Ambani: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంపై మోడీకి ముఖేష్ అంబానీ అభినందనలు

Mukeshambani

Mukeshambani

ఆపరేషన్ సిందూర్ విజయంపై ప్రధాని మోడీని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభినందించారు. శుక్రవారం రైజింగ్ నార్త్‌స్టెస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ముఖేష్ అంబానీ తన ప్రసంగాన్ని ఆపరేషన్ సిందూర్ విజయం సాధించినందుకు మోడీకి వందనం చేస్తూ ప్రారంభించారు. మోడీ ఉక్కు సంకల్పానికి ఆపరేషన్ సిందరూ నిదర్శనం అని అభివర్ణించారు. ఈ విజయం మోడీ ఉక్కు సంకల్పానికి.. సాయుధ దళాల అసమాన ధైర్యసాహసాలకు ప్రకాశవంతమైన నిదర్శనం అని కొనియాడారు. ఉగ్రవాదం పట్ల భారత్ ఎప్పుడూ మౌనంగా ఉండదని.. మన గడ్డపై, మన పౌరులపై దాడి జరిగితే సహించబోమని మోడీ నాయకత్వం నిరూపించిందన్నారు.

ఇది కూడా చదవండి: AI : అదిరింది.. హైదరాబాద్‌లో AIతో సూదిరహిత రక్త పరీక్షలు..

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడుల్లో 26 మంది హిందువులు చనిపోయారు. 26 మంది కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ పరిణామం భారతీయుల హృదయాలను కదిలించింది. దీంతో ప్రధాని మోడీ నాయకత్వంలో పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపివేసింది. ఇంతలోనే మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత్ జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాక్ వైమానిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో దాయాది దేశం తోక ముడిచి కాల్పుల విరమణకు వచ్చింది. పాక్ అడగడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి: Tamannaah: మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం

 

Exit mobile version