Site icon NTV Telugu

Mukesh Ambani: ప్రధాని మోడీ దేశానికి అజేయమైన రక్షణ..

Mukhesh Ambani

Mukhesh Ambani

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో భారత్ రక్షించబడిందని, దీనికి కారణం‘‘నరేంద్రమోడీ అనే అజేయమైన రక్షణ గోడ’’ ఉందని అన్నారు. రాజ్‌కోట్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో ప్రసంగించిన అంబానీ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థిలు ఉన్నప్పటికీ, వాటి ప్రభావం భారతీయులపై పడలేదని, భారతదేశానికి నరేంద్రమోడీ అజేయమైన రక్షణ గోడ ఉంది’’ అని అన్నారు.

Read Also: Somnath Temple: “సోమనాథ్ ఆలయం”పై తొలిదాడికి 1000 ఏళ్లు.. గజనీ, ఖిల్జీ, మొఘల్స్ దాడుల్ని తట్టుకున్న ఘన చరిత్ర..

ఈ దశాబ్ధం భారతదేశ భవిష్యత్తును నిర్వచిస్తుందని అన్నారు. 2036 ఒలింపిక్స్‌ను అహ్మదాబాద్‌కు తీసుకురావాలనే ప్రధానమంత్రి దార్శనికతకు రిలయన్స్ ఫౌండేషన్ మద్దతు ఇస్తుందని, నరన్‌పురాలోని వీర్ సావర్కర్ మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్వహించడానికి, దానిని జాతీయ- అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు, అథ్లెట్ శిక్షణకు కేంద్రంగా మార్చడానికి రిలయన్స్ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగి ఉంటుందని ఆయన అన్నారు. రిలయన్స్ గత ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల్ని పెట్టిందని చెప్పారు. ఏఐని అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో భారత్‌లోనే అతిపెద్ద AI-రెడీ డేటా సెంటర్‌ను నిర్మించే ప్రణాళికలను ఉన్నట్లు చెప్పారు.

జియో భారతదేశం, ప్రపంచం కోసం భారతదేశంలో నిర్మించబడిన” పీపుల్-ఫస్ట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తుందని, ప్రజల రోజువారీ ఉత్పాదకతను మెరుగుపరచడానికి వారి స్వంత భాషలో, వారి స్వంత పరికరాల్లో AI సేవలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని ముఖేష్ అంబానీ ప్రకటించారు.

Exit mobile version