Somnath Temple: “సోమనాథ్ ఆలయం”పై తొలిదాడికి 1000 ఏళ్లు.. గజనీ, ఖిల్జీ, మొఘల్స్ దాడుల్ని తట్టుకున్న ఘన చరిత్ర..
- సోమనాథ్ ఆలయంపై తొలిదాడికి 1000 ఏళ్లు..
- 1026లో గజనీ తొలిదాడి, ఆ తర్వాత ఖిల్జీ, ఔరంగజేబు దాడులు..
- ఎంతో మంది దుర్మార్గుల్ని తట్టుకుని నిలబడ్డ ఘన చరిత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somnath Temple: సోమనాథ ఆలయం, భారత చరిత్రకు అదుదైన ఒక సాక్ష్యం. కోట్లాది మంది హిందువుల నమ్మకమే ఈ ఆలయాన్ని శతాబ్ధాలుగా నిలబెట్టింది. ఎంతో మంది దేశద్రోహులు దాడులు చేసి, ఆలయాన్ని కొల్లగొట్టి, కూల్చివేసినా.. తట్టుకుని నిలబడింది. సోమనాథ ఆలయంపై తొలి దాడికి 1000 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన పర్వ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. స్వాతంత్ర్యానంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించగా, 1951లో పూర్తి చేశారు.
గుజరాత్ లోని వెరావల్ సమీపంలోని ప్రభాస్ పటాన్ వద్ద, అరేబియా సముద్ర తీరంలో సోమనాథ్ ఆలయం ఉంది. హిందువుల పవిత్ర స్థలాల్లో సోమనాథ్ ఒకటి. ఇక్కడే శివుడు అగ్నిస్తంభంగా అవతరించారని నమ్ముతారు. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో మొదటిగా పరిగణించబడుతుంది. కపిలి, హిరణి, సరస్వతి నదుల సంగమస్థలమైన త్రివేణీ సంగమం వద్ద ఈ తీర్థక్షేత్రం ఉంది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఘజనీ నుంచి మొఘల్స్ వరకు దాడులు, పునర్నిర్మాణం.
భారతదేశ చరిత్రలో సోమనాథ్ ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంతో మంది ఈ ఆలయంపై దండయాత్ర చేశారు. 1026లో గజనీ మహ్మద్ థార్ ఎడారి దాడి పశ్చిమ భారతదేశంపై దాడి చేశాడు. ఆ సమయంలో సోమనాథ్ ఆలయం చాళుక్య వంశానికి చెందిన భీమదేవ-1 పాలనలో ఉంది. స్థానిక పూజారులు, ప్రజలు, కొంతమంది వీరులు ఆలయాన్ని రక్షించేందుకు తీవ్రంగా పోరాడారు. అయినప్పటికీ గజనీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి, విలువైన సంపదను దోచుకున్నాడు. సుమారుగా ఆ సంపద విలువ 20 మిలియన్ దినార్లుగా అంచనా. లింగాన్ని ధ్వంసం చేసి, ఆలయాన్ని కాల్చి వేశాడు.
సోమనాథ్ ఆలయాన్ని 1143-1172 మధ్య రాజు కుమారపాలుడు రాతి, ఆభరణాలతో ఆలయాన్ని అలంకరించి, నిర్మించాడు. ఆ తర్వాత, మరోసారి 1299లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం ఆలయాన్ని మళ్లీ ధ్వంసం చేసింది. 1308లో సౌరాష్ట్ర చూడాసమ రాజు మహిపాలుడు ఆలయాన్ని మళ్లీ పునర్నిర్మించారు. 1331-1351 మధ్య ఆయన కుమారుడు ఖేంగార ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించారు. 1395లో గుజరాత్ సుల్తాన్ రాజు జఫర్ ఖాన్ ఆలయాన్ని మూడోసారి ధ్వంసం చేశాడు. 17వ శతాబ్ధంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమయంలో కూడా ఆలయంపై దాడి జరిగినట్లు చరిత్ర చెబుతోంది. 18వ శతాబ్ధం వచ్చే సరికి ఆలయం పూర్తిగా దెబ్బతింది. స్వాతంత్ర్యం తర్వాత, ఈ ఆలయ పునర్నిర్మాణానికి దేశ తొలి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ పునాది వేశారు. ప్రస్తుతం, ఈ ఆలయాన్ని శ్రీ సోమనాథ్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. భారత ప్రధాని ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!