NTV Telugu Site icon

Triple Talaq: బీజేపీకి సపోర్ట్ చేసినందుకు భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’’

Triple Talaq

Triple Talaq

Triple Talaq: బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు తన భర్య ‘ట్రిపుల్ తలాక్’’ చెప్పాడని 26 ఏళ్ల మహిళన తన భర్తపై ఆరోపణలుచేసింది. బీజేపీకి సపోర్టు చేస్తున్నాననే కోపంతో తన భర్త ఇలా చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ చింద్వారాలో చోటు చేసుకుంది. తనకు 8 ఏళ్ల క్రితం పెళ్లి అయినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సదరు మహిళ పేర్కొంది.

Read Also: Renu Desai: నా కూతురు ఏడుస్తూనే ఉంది.. ఆ కర్మ మిమ్మల్ని వదలదు.. వారిపై రేణు దేశాయ్ శాపనార్దాలు

గత కొంతకాలంగా వారి మధ్య సంబంధం సాధారణంగానే ఉందని, ఆ తర్వాత ఆమె భర్త, అత్త, ఆడపడుచులు ఏదో సమస్యపై వెక్కిరించడం, కొట్టడం ప్రారంభించారని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఉమేష్ గోల్హాని సోమవారం విలేకరులు సమావేశంలో చెప్పారు. తనను ఏడాదిన్నర క్రితం ఇంటి నుంచి గెంటేశారని, తన భర్తతో కలిసి అద్దె గదిలో ఉంటున్నానని ఆ మహిళ పేర్కొంది. అయితే, మహిళ, భర్త ఇష్టానికి వ్యతిరేకంగా బీజేపీకి ఓటేసింనందుకు ట్రిపుల్ తలాక్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మహిళ ఫిర్యాదు మేరకు ఆమె అత్త, నలుగురు ఆడపడుచులపై వరకట్న నిషేధ చట్టం, ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతి చట్టాల కింద కేసు నమోదు చేశారు. ‘‘నేను బీజేపీకి మద్దతుగా ఓటేశాను. ఈ విషయం భర్త తల్లి, సోదరిణులు తెలియగానే, నా భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ’’ అని మహిళ ఆరోపించింది. అయితే, మహిళ భర్త మాత్రం ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయని, ఇదే వివాదానికి కారణమని, పిల్లల భవిష్యత్ కోసం ఆమెచు చాలా అవకాశాలు ఇచ్చానని చెప్పాడు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం ట్రిపుల్ తలాక్‌కి కారణం కానని చెప్పాడు. తన భార్య తనను బెదిరిస్తోందని, తన ప్రతిష్టను దిగజారుస్తోందని, తన కుటుంబాన్ని నాశనం చేస్తోందని అతను ఆరోపించారు.