NTV Telugu Site icon

Sonia Gandhi: ఉపాధి హామీ పథకాన్ని బలహీనపర్చడం బాధాకరం

Soniyagandhi

Soniyagandhi

ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరచడం బాధాకరం అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై రాజ్యసభలో సోనియా మాట్లాడారు.

ఇది కూడా చదవండి: Kollywood : అందని ద్రాక్ష కోసం అరడజను సినిమాలు..

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని క్రమపద్ధతిలో బలహీనపరచడం చాలా ఆందోళనకరం అని తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 86,000 కోట్లు స్తబ్దుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పథకం బహుళ సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. వేతన చెల్లింపుల్లో నిరంతరం జాప్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే ప్రస్తుతం చెల్లిస్తున్న నగదు కూడా సరిపోదని.. దాన్ని రూ.400 కనీస వేతనంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సకాలంలో వేతనం ఇవ్వకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని సభ దృష్టికి సోనియా తీసుకొచ్చారు. ఇక పథకాన్ని మరింత విస్తరించడానికి తగినంతగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని కేంద్రాన్ని సోనియా కోరారు.

ఇది కూడా చదవండి: Janhvi Kapoor : ఆ ప్రమాధం నా జీవితంలో మర్చిపోను..