పెళ్లి చూపులు.. ఒకరికొకరు ఇష్టపడడం.. పెద్దలు పెళ్లికి ముహూర్తాలు పెట్టడం. బంధువులకు పెళ్లి కార్డులు పంచడం. మండపాలు, లైటింగ్, గ్రాండ్‌గా వివాహ ఏర్పాట్లు, కొత్త బట్టలు, నగలు, ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకుని అమ్మాయి-అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకుని ఏడడుగులు నడిచి సంతోషంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. హాయ్‌గా సంసారం సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో నవ వధువు ఒక్కసారిగా షాకిచ్చింది. నగలు, నగదు తీసుకుని ప్రియుడితో పరారైంది. ఈ ఘటనతో వరుడు బంధువులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Singapore: స్టార్ హోటల్ ఎంట్రన్స్‌లో మలవిసర్జన.. భారతీయుడికి కోర్టు రూ.25 వేలు ఫైన్
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రెండు నెలల క్రితమే ఓ జంట పెళ్లి చేసుకున్నారు. కేవలం అంటే కేవలం రెండు నెలల్లో భర్తతో ఆమె 17 రోజులే ఉంది. మనిషేమో ఇక్కడా.. మనసేమో ప్రియుడి దగ్గర ఉంది. భర్తతో ఉంటూనే ప్రియుడితో ఊహాల్లో విహరిస్తోంది. మొత్తానికి సమయం చూసి ఇంట్లో ఉన్న రూ.4లక్షల నగలు తీసుకుని ప్రియుడితో పరారైంది. ఇదిలా ఉంటే పెళ్లైన దగ్గర నుంచి ప్రియుడితో టచ్‌లోనే ఉంది. పెళ్లి ఫొటోలు కూడా ప్రియుడికి పంపించింది. అంతేకాదు.. ఈ పెళ్లికి ముందే ప్రియుడిని వివాహం చేసుకున్నట్లు సమాచారం. బాధితడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: NDA Govt: వక్ఫ్ బిల్లు, వన్ నేషన్-వన్ ఎలక్షన్.. బీజేపీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
బాధితుడు సంతోష్ ప్రజాపతి.. అంజలి అనే యువతిని గ్వాలియర్‌లోని జైన్ ధర్మశాలలో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మహిళ కుటుంబం ఆమెకు వీడ్కోలు పలికింది. ఆమె తన భర్తతో కలిసి వెళ్లింది. రెండు రోజుల తర్వాత సంతోష్ బయటి పనికి వెళ్లాడు. రెండు వారాల తర్వాత తిరిగి వచ్చేసరికి భార్య కనిపించలేదు. ఇంట్లో వాళ్లను అడిగిన వెంటనే ఆమె తన తల్లి ఇంటికి వెళ్లి త్వరలో తిరిగి వస్తుందని అతని కుటుంబ సభ్యులు అతనికి సమాచారం ఇచ్చారు. ఆమె తిరిగి రాకపోవడంతో అతనికి అనుమానం వచ్చి అల్మీరాలో రూ. 4 లక్షల విలువైన నగలు మరియు రూ.25,000 నగదు మాయమైనట్లు గ్రహించాడు. ఆ తర్వాత తన కూతురు తన ప్రియుడితో కలిసి పారిపోయిందని అత్తగారి నుంచి కాల్ వచ్చింది. ఇంతలో అంజలి తన పాత వివాహ ఫోటోలను ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా సంతోష్‌కు పంపింది. ఆర్య సమాజ్ మందిర్‌లో వారి వివాహానికి మూడు నెలల ముందు తన ప్రేమికుడిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్ జనక్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: RBI: ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్‌కు ఊరట.. గోల్డ్ లోన్ బిజినెస్‌పై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేత