NTV Telugu Site icon

Saibaba Temple: సాయి పాదాలమీదే ప్రాణాలు వదిలాడు

Saibaba Feet

Saibaba Feet

Saibaba Temple: చావు ఎప్పుడు ఏ క్షణాల మనిషికి ప్రాణాలు తీసుకుంటుందో తెలియని అయోమయం. మాట్లాడుతున్న, డ్యాన్స్‌ చేస్తున్న ఏ క్షణాన మృత్యువు తన ఓడికి చేర్చుకుంటుందో తెలియదు. ఇలాంటి ఘటనలు మనం తరుచూ చూస్తున్నాము. సాయిబాబా ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రార్థనలు చేస్తూ మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఆ వ్యక్తి గుడిలో సాయిబాబా ముందు తల వంచి తిరిగి లేవలేదు. ఆ వ్యక్తిని రాకేష్‌గా గుర్తించారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

స్థానికంగా మెడికల్ షాప్ నడుపుతున్న రాకేష్ మెహానీకి సాయినాథుడు అంటే చాలా భక్తి. ప్రతి గురువారం మండి రోడ్డులోని సాయిబాబా ఆలయానికి వెళ్లేవాడు. అయితే డిసెంబర్ 1న సాయిబాబా ఆలయానికి వెళ్లిన రాకేష్ బాబా పాదాలను తలను వంచి ప్రార్థిస్తూ అలాగే ఉండిపోయాడు. నమస్కరిస్తున్నాడని అక్కడి భక్తులు భావించారు. అటుగా వెళ్లిన వారు నమస్కరిస్తున్న రాకేష్ నుంచి ఏ చలనం లేదు. పావుగంట పాటు కదలకుండా ఉండిపోయిన రాకేష్ స్పృహ తప్పి పడి ఉండడం చూసిన వారికి అనుమానం వచ్చింది. అయితే అక్కడే వున్న పూజారి రాకేష్ ను తడిమి చూడగా రాకేష్ స్పృహలో లేదు. విషయం తెలుసుకున్న ఆలయ పూజారి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాకేష్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. రాకేష్ గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. అక్కడున్న సీసీటీవీలో రాకేష్ కుప్పకూలిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన సాయిబాబా పాదాల చెంత మరణించడం వల్ల మోక్షం లేదా స్వర్గం లభిస్తుందని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు.

సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని పిలువబడే సైలెంట్ హార్ట్ ఎటాక్ విపరీతమైన ఛాతీ నొప్పి, ఒత్తిడి, అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడం, తల తిరగడం వంటి లక్షణాలను కలిగి ఉంటుందని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. బయటకి ఆరోగ్యంగా కనిపించినా క్షణాల్లో గుండెపోటుతో చనిపోతారని అన్నారు. రాకేష్‌ కి కూడా ఇలా చనిపోవడానికి కారణం ఇదే అని చెబుతున్నారు.