NTV Telugu Site icon

Priyanka Gandhi: ప్రచారంలో మదర్ థెరిస్సా ప్రస్తావన.. పాత జ్ఞాపకాలు పంచుకున్న ప్రియాంక

Priyankagandhi

Priyankagandhi

వయనాడ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ దూసుకుపోతున్నారు. సోమవారం కొండ నియోజకవర్గంలో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. మదర్ థెరిస్సాను గుర్తుచేసుకున్నారు. తన తండ్రి రాజీవ్‌ గాంధీ హత్య జరిగిన కొద్ది రోజులకు మదర్‌ థెరెసా మమ్మల్ని పలకరించడానికి ఇంటికి వచ్చారని.. అప్పుడు తనకు 19ఏళ్లు అని చెప్పారు. ఆమె వచ్చిన సమయంలో జ్వరంతో బాధపడుతున్నానని.. అమ్మను పలకరించిన అనంతరం థెరెసా తన దగ్గరికి వచ్చి తలపై చేయి పెట్టి ఆశీర్వదించారన్నారు. నిరుపేదల కోసం పని చేయాలని తనను ఆహ్వానించారని గుర్తుచేశారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత తాను వారి సంస్థతో కలిసి పని చేయడానికి వెళ్లినట్లు చెప్పారు. అక్కడ ఉన్న సోదరీమణులతో కలిసి బాత్రూంలు శుభ్రం చేయడం, వంట చేయడం వంటి పనులు చేసినట్లు తెలిపారు. అప్పుడే కష్టాల్లో ఉన్న వారికి సమాజం ఎలా చేయూతనందిస్తుందో తెలుసుకున్నానన్నారు. వయనాడ్‌ విపత్తు సమయంలో తోటివారికి ఎలా సాయం చేయాలో మదర్ థెరెస్సా మాటలు రుజువు చేశాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల సమస్యల గురించి ఆలోచిస్తుందని ప్రియాంక అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాపారవేత్తలైన తన స్నేహితులకు అనుకూలంగా పాలసీలు రూపొందిస్తున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: CM Relief Fund: వరద బాధితుల కోసం విరాళాల వెల్లువ..

నవంబర్ 13న వయనాడ్ బైపోల్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ప్రియాంకపై పోటీగా బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీలో క్రీయాశీలకంగా ఉన్న నవ్య హరిదాస్‌ను బరిలోకి దింపింది. ఈమె కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండు జాతీయ పార్టీలు పోటీపోటీగా ప్రచారం చేస్తున్నారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే గాంధీ కుటుంబానికి కుంచుకోట అయిన రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుని.. వయనాడ్ స్థానాన్ని రాహుల్‌గాంధీ వదులుకున్నారు. దీంతో వయనాడ్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న పోలింగ్ జరుగుతుండగా.. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Cyber Security Awareness : సైబర్ నేరాలపై భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కీలక సూచనలు