NTV Telugu Site icon

Illicit Affair: కౌన్సిలర్ ప్రియుడి మోజులో పసిబిడ్డల్ని దారుణంగా హతమార్చిన తల్లి..

Uttar Pradesh

Uttar Pradesh

Illicit Affair: వివాహేతర సంబంధాలు కన్నవారి ఉసురుతీస్తున్నాయి. క్షణ కాలం సుఖం కోసం బంగారం లాంటి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. భర్తలను హతమార్చడం, పిల్లలను చంపడం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో చాలా చోట్ల జరిగాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తమ బంధానికి అడ్డుగా వస్తున్నారని ప్రియుడి సహాయంతో ఓ తల్లి కొడుకు, కూతుర్ని హత్య చేసింది.

Read Also: S Jaishankar: ఖలిస్తానీవాదుల దాడి.. యూకేకు గట్టిగా ఇచ్చిపడేసిన జైశంకర్..

ఉత్తర్ ప్రదేశ్ మీరట్ లో ఓ మహిళ తన ప్రియుడి సాయంతో 10 ఏళ్ల కొడుకు, 6 ఏళ్ల కుమార్తెను హతమార్చింది. ఈ సంఘటన మార్చి 22న జరిగింది. ప్రియుడు సౌద్ స్థానిక కౌన్సిలర్ కావడం గమనార్హం. పిల్లలను చంపిన తర్వాత ఇద్దరూ వారి మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఈ కేసులో మరికొంత మంది ప్రమేయం కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. పిల్లల కనిపించకుండా పోవడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషుల హస్తం ఉందని పోలీసులు చెప్పారు. పిల్లల మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని మీరట్ ఎస్సీ పీయూష్ సింగ్ తెలిపారు.

Show comments