Mother-in-law dies of shock after man divorces wife: వరకట్న వేధింపులు ఒకరి ప్రాణాలన్ని బలితీశాయి. భార్యకు విడాకులు ఇవ్వడంతో ఈ వార్త విని యువతి తల్లి మరణించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. వివరాల్లోకి వెళితే లక్నోలో ఓ వ్యక్తి స్పోర్ట్స్ బైక్ కొనేందుకుందు కట్నం డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రిపుల్ తలాక్ ఇచ్చి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో షాక్ కు గురైన యువతి తల్లి మరణించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. లక్నోలోని అమీనాబాద్ చికామండి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తునన మహిళకు లాహర్ పూర్ సీతాపూర్ కు చెందిన మహ్మద్ యూనస్ అనే వ్యక్తితో 2021లో వివాహం జరిగింది. వివాహం తరువాత మహిళ అత్తమామలు కట్నం డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఇరు కుటుంబాలు రాజీకి వచ్చి యువకుడి కుటుంబం రూ. 2 లక్షలు అడిగారు.
అయితే ఈ డబ్బు కోసం ప్రతీ రోజు సదరు వ్యక్తి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. మహిళ కట్నం డబ్బు తీసుకురాకపోవడంతో కొట్టి ఇంటి నుంచి గెంటేశాడు. కాగా.. బాధితురాలు రూ. 2లక్షలు ఇవ్వడానికి నిరాకరించడంతో ఫోన్ లో త్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఈ విషయం తెలిసి బాధితురాలి తల్లి షాక్ కు గురై మరణించింది. ఈ ఘటన తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ చిరంజీవి నాథ్ సిన్హా తెలిపారు.
