మహా కుంభమేళా మరో రికార్డ్ సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు ఊహించని రీతిలో భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దాదాపు అగ్ర రాజ్యం అమెరికా జనాభా కంటే రెండు రెట్లు అధికంగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు. అమెరికా ప్రస్తుత జనాభా 34 కోట్లు మంది ఉన్నారు. అలాంటిది ప్రయాగ్‌రాజ్‌కు ఇప్పటి వరకు 60 కోట్ల మందికి పైగా తరలివచ్చి పుణ్యస్నానాలు చేసినట్లుగా ఇప్పటికే యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ఈ కుంభమేళ ముగియనుంది. ఈ సందర్భంగా కోట్లాదిగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో అత్యధికంగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తారని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Share Market Holiday: మహాశివరాత్రి నాడు స్టాక్ మార్కెట్ మూతపడుతుందా లేదా ?
జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. దాదాపు 6 వారాల పాటు ఈ ఉత్సవం సాగుతోంది. ఈ కుంభమేళా 2 వేల సంవత్సరాలు క్రితం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ కుంభమేళా కొనసాగుతోంది. ఈ కుంభమేళాకు వచ్చే భక్తులంతా పాపాలు పోయి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది.
ఫిబ్రవరి 26న ముగిసే నాటికి యాత్రికుల సంఖ్య దాదాపు అర బిలియన్ వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైలు, విమానాలు, బస్సులు, కార్లు.. ఇలా రకరకాలైన ట్రావెలింగ్ ద్వారా భక్తులు తరలివచ్చారు. ఇక యూపీ ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం 7,500 ఫుట్‌బాల్ మైదానాల కంటే పెద్ద విస్తీర్ణంలో తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. 150,000 టాయిలెట్లు, 30 తేలియాడే వంతెనలు, 70,000 వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఇక తప్పిపోయే వారి కోసం 24 గంటలు పని చేసేలా 10 సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఈ వారంలో కూల్చేస్తారు. ఇక జనవరి 29న తొక్కిసలాట కారణంగా 30 మంది చనిపోయారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో కూడా తొక్కిసలాట కారణంగా 18 మంది చనిపోయారు.
ఇది కూడా చదవండి: Elephants Attack: ఏనుగుల దాడిలో భక్తుల మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన..